Advertisement
Google Ads BL

షూటింగ్ సెట్ లో ఏడ్చేసిన సాయి పల్లవి


అమరన్ చిత్రంతో 200 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఓ సినిమా షూటింగ్ సెట్ లో ఏడ్చిన ఘటనను తాజాగా రివీల్ చేసింది. గతంలో నాని తో కలిసి ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్ సెట్స్ లో సాయి పల్లవి ఏడ్చిన విషయం బయటపెట్టింది. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి తానెందుకు సెట్స్ లో ఏడవాల్సి వచ్చిందో రివీల్ చేసింది. 

Advertisement
CJ Advs

శ్యామ్ సింగరాయ్ లో నేను కనిపించిన సన్నివేశాలు చాలావరకు రాత్రిళ్లే చిత్రీకరించారు. నాకేమో నైట్ షూటింగ్‌లు అస్స‌లు అలవాటు లేదు. రాత్రి నిద్ర పోకుండా ఉండలేను. పగలు పడుకుందామనుకున్నా నాకు నిద్రరాదు, షూటింగ్ చేస్తున్న సమయంలో రాత్రిపూట నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. 

ఒక్కోసారి షూటింగ్ కోసం తెల్లారేవరకు మేల్కొని ఉండాల్సి వచ్చేది. అప్పుడు బిజీ షెడ్యూల్ వలన డే ఒక సినిమా షూటింగ్, నైట్ శ్యామ్ సింగరాయ్ షూటింగ్ చేసేదాన్ని. ఒకసారి నేను నైట్ షూటింగ్ చేస్తుంటే నన్ను కలిసేందుకు నా చెల్లి వచ్చింది. తనతో మాట్లాడుతూ ఒక్కసారిగా నాకు ఏడుపొచ్చేసింది. కమిట్ అయిన సినిమాలు పూర్తి చెయ్యాలి కానీ.. ఒక్క రోజు రెస్ట్ దొరికితే బాగుండు అంటూ నా బాధను త‌న‌తో షేర్ చేసుకున్నా. 

ఆ తర్వాత నా చెల్లి అక్కడనుంచి నేరుగా ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లి.. మా అక్క ఏడుస్తోంది. ఒక్క రోజైనా రెస్ట్ ఇవ్వండి అని అడిగింది. ఆయన వెంటనే నా వద్దకు వచ్చి.. ఒకటి కాదు పది రోజులు తీసుకోమ్మా.. అంతా బాగా ఉంది అనుకున్న‌ప్పుడు షూట్‌కు రా అంటూ చెప్పడంతో ఏంతో రిలాక్స్ అయ్యాను.. ఒక రోజు రెస్ట్‌ దొరికింది అంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది. 

Sai Pallavi cried on the shooting set:

When Sai Pallavi broke down during Shyam Singha Roy shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs