Advertisement
Google Ads BL

జగన్ ని నమ్ముకుంటే ఇక అంతే..!


అరెస్టులకు భయపడకండి.. మీ వెనక జగన్ ఉన్నాడు అని నమ్మినందుకే వైసీపీ కార్యకర్తలకు ఈరోజు జైలుకు పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. జగన్ అండ చూసి సోషల్ మీడియాలో వీర విహారం చేసిన గ్యాంగ్ ని ఒక్కొక్కరిగా ఏరి పోలీస్ పవర్ చూపిస్తున్నారు కూటమి నేతలు. వైసీపీ పార్టీ ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై చేసిన ట్వీట్ల ఫలితం నేడు కూటమి ప్రభుత్వంలో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. 

Advertisement
CJ Advs

ఇప్పటికే వర్ర రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ లాంటి వాళ్ళు అమ్మనాబూతులు తిట్టి నేడు జైలు పాలయ్యారు. రీసెంట్ గా ఇంటూరి రవి ఇలా చాలామంది అరెస్ట్ అయ్యారు. జగన్ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తే మీ వెనుక నేనున్నాను అంటూ ప్రెస్ మీట్ పెడుతున్నాడు తప్ప ఇప్పటికి సోషల్ మీడియాలో ట్వీట్ వేసే ముందు..  ముందూ వెనుక ఆలోచించండి అని చెప్పట్లేదు. 

ప్రభుత్వ పథకాల అమలు ఎప్పుడు, సూపర్ సిక్స్ అమలు ఎపుడు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఈ అరెస్ట్ లు అంటున్నాడు తప్ప.. దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యండి, మా కార్యకర్తలను కాదు అనడం లేదు జగన్. మార్గని భరత్ అయితే అరెస్టులకు బయపడకండి.. మీ వెనక జగన్ ఉన్నాడు అంటూ చెబుతున్నాడు. 

ఇప్పటివరకు జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన అందరికి చివరికి జైలు గతి పట్టింది. శ్రీరెడ్డి, RGV లాంటి వాళ్లకు అర్ధమై బుద్ధి తెచ్చుకుని  కామయ్యారు. కానీ కొంతమంది ఇంకా వైసీపీ పార్టీ కింద పని చెయ్యడం వలన ఇలా అరెస్ట్ అవ్వాల్సిన అగత్యం ఏర్పడింది. అరెస్ట్ అయ్యాక జగన్ వెనుక నిలబడి ఏం చేస్తాడు భరత్ అంటూ మార్గని భరత్ ని ఎడా పెడా ఏసుకుంటున్నారు నెటిజెన్స్. 

If you believe Jagan, that s all..!:

YSRCP social media activist Ravinder Reddy arrested
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs