Advertisement
Google Ads BL

యూట్యూబ్ చానల్ పై అల్లు ఫ్యాన్స్ మెరుపు దాడి


అల్లు అర్జున్ ఫ్యాన్స్ సహనం కోల్పోయారు, పుష్ప 2 ద రూల్ విడుదలకు దగ్గరవుతున్న సమయంలో అల్లు ఫ్యాన్స్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ పై దాడికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కూర్చున్నాయి. అల్లు అర్జున్ పై పదే పదే తప్పుడు వార్తలను ఈ ఛానెల్ స్ట్రీమింగ్ చేస్తుండటంతో అల్లు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
CJ Advs

అంతేకాదు ఆ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మూకుమ్మడిగా దాడి చేశారు. అల్లు ఫ్యాన్స్ దాడిలో సదరు యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ లో ఫర్నిచర్‌తో పాటు కంప్యూటర్లు ఇతర సామాగ్రి ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ పై కావాలనే అస్సహ్యమైన థంబ్స్‌ లైన్స్ తో వీడియోలు పెడుతున్నారని, వాళ్లకు బుద్ధిచెప్పేందుకే ఈ దాడి చేశామని ఫ్యాన్స్ ప్రకటించారు.

మళ్ళీ ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఫ్యాన్స్ సదరు యూట్యూబర్స్ ను హెచ్చరించారు. ఇప్పుడీ వార్త టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. గతంలోనే ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా దాడికి దిగారు.

Allu Arjun Fans Attack On YouTube channel:

Allu Arjun Fans Attack YouTube channel Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs