Advertisement
Google Ads BL

రూ. 2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్


రూ. 2.94 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు, ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. సమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని, రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందన్నారు. గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించిందని, ముఖ్యంగా పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఉత్పాదక మూలధనాన్ని నిలిపివేసిందని, తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

Advertisement
CJ Advs

కేటాయిపులు ఇలా..

జలవనరులు : రూ.16,705 కోట్లు

వ్యవసాయశాఖ : రూ.11,855 కోట్లు

వైద్యారోగ్యశాఖ : రూ.18,421 కోట్లు

పాఠశాల విద్య : రూ.29,909 కోట్లు

ఉన్నత విద్య : రూ.2,326 కోట్లు

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి : రూ.16,739 కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి : రూ.11,490 కోట్లు

గృహనిర్మాణం : రూ.4012 కోట్లు

పోలీస్‌శాఖ : రూ.8,495 కోట్లు

బీసీ వెల్ఫేర్‌ : రూ.39,007 కోట్లు

ఎస్సీ సంక్షేమం : రూ.18,497

ఎస్టీ సంక్షేమం : రూ.7,557

మైనార్టీ సంక్షేమం : రూ.4,376 కోట్లు

మహిళాశిశు సంక్షేమశాఖ : రూ.4,285 కోట్లు

రోడ్డు, భవనాలశాఖ : రూ.9,554 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యశాఖ : రూ.3,127 కోట్లు

ఇంధనశాఖ : రూ.8,207 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్ : రూ.1,215 కోట్లు

యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ : రూ.322 కోట్లు

పర్యావరణ, అటవీశాఖ : రూ.687 కోట్లు

189 కి.మీ. అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం

ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటాకోసం 3శాతం రిజర్వేషన్‌

అన్నీ పూర్తి చేస్తాం..

సుస్థిర పట్టణాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

అమృత్‌ -2 కింద జలవనరుల శుద్ధీకరణ చేస్తున్నాం

పోలవరం పూర్తిచేయడమే మా మొదటి ప్రాధాన్యత

నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

రాష్ట్రంలో రహదారుల కంటే గుంతలే ఎక్కువగా ఉన్నాయి గుంతలు లేని రహదారుల ఆంధ్ర మిషన్‌కు శ్రీకారం

189 కిలోమీటర్ల అమరావతి-ఓఆర్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పునరుద్ధరణకు కేంద్రం ఆమోదం

ప్రాంతీయ అనుసంధానం, ఆర్థికాభివృద్ధిని ఎక్స్‌ప్రెస్‌వే పెంచుతుంది

క్రీడలను ప్రోత్సహిస్తాం.. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు

సైబర్‌ నేరాలు అరికట్టేందుకు చర్యలు

ప్రతీ జిల్లాలో సైబర్‌ పోలీస్‌ స్టేషన్ ఏర్పాటు : మంత్రి పయ్యావుల కేశవ్

ఇంకొన్ని ఇలా..

దీపం పథకం ద్వారా 5 లక్షల మందికి లబ్ధి

వచ్చే మూడేళ్లలో 18 వేల మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి

పాఠశాల విద్యాశాఖకు రూ. 29,909 కోట్లు

ఉపాధ్యాయులపై యాప్ భారం తగ్గింపు

192 నైపుణ్య కేంద్రాలు, కళాశాలల ఏర్పాటు

విదేశీ ఉపాధి అవకాశాలు పెంచడమే స్కిల్ ఇంటర్నేషనల్ లక్ష్యం

దేవదాయశాఖ కోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు

6 వేల దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం..

రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు

అర్చకుల వేతనం రూ.10 నుంచి రూ.15 వేలకు పెంపు

వేద విద్య చదువుకున్న నిరుద్యోగులకు రూ.3 వేల భృతి

కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతుల పునరుద్ధరణ

160 దేవాలయాల ఆధునీకరణ పనులకు రూ.113 కోట్లు

వ్యవసాయ బడ్జెట్ ఇలా..

ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్

బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్

ఏపీ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం 

వ్యవసాయానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం

వ్యవసాయం ఆధారంగా 62శాతం జనాభా జీవిస్తున్నారు

గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది

రైతులకు పంట బీమా అందించలేదు

పెట్టుబడి సాయం పెంచి నెలరోజుల్లోనే అందించాం

వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత

రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో భూసార పరీక్షలు

మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు

సాగుకు సూక్ష్మపోషకాలు అందిస్తాం

గత ప్రభుత్వం రైతులకు పంటల బీమా అందించలేదు

వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తాం: అచ్చెన్నాయుడు

Rs. AP annual budget with 2.94 lakh crores:

Annual Budget of Rs 2.94 Lakh Crores for AP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs