నిజంగా సమంత పర్సనల్ లైఫ్ లో ఎంతగా సఫర్ అయ్యిందో ఆరోగ్య పరంగా అంతకన్నా ఎక్కువగా సఫర్ అయ్యింది. నాగ చైతన్య తో విడాకులు, మరొపక్క ట్రోలింగ్ ని తట్టుకుంటూ మానసికంగా కుంగిపోయిన సమంత ను మాయోసైటిస్ మరింతగా కుంగదీసింది. యశోద సినిమా సమయంలో ఆమె ఆ వ్యాధి బారిన పడిన విషయం బయటికి వచ్చింది.
ఆతర్వాత కోలుకుని నెమ్మదిగా తన పని తాను చేసుకుంది. అయితే సిటాడెల్ హానీ-బన్నీ సీరీస్ సమయంలోను సమంత మాయోసైటిస్ తో పోరాడుతూనే ఉంది. సమంత తప్పుకుందామనుకున్నా దర్శకనిర్మాతలు పట్టుబట్టి ఆమెతో ఆ హానీ రోల్ చేయించారు అనే విషయం ప్రమోషన్స్ లో సమంత చెప్పింది. సిటాడెల్ హానీ-బన్నీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.
ఈ సీరీస్ కి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా.. సమంత షూటింగ్ సమయంలో పడిన కష్టాలు ఎవ్వరికి రాకూడదంటూ హీరో వరుణ్ ధావన్ చెప్పడం అందరికి షాకిచ్చింది. సమంత రెండు గంటల పాటు సీన్ చేసాక ఇక మళ్ళీ నాకు ఆ రోజు వచ్చేసింది అంది, ఆ వేంటనే ఆక్సిజెన్ సిలిండర్ ఆమె దగ్గరకు వచ్చింది. అది చూసి నేను చాలా భయపడ్డాను.
ఆ తర్వాత సెర్బియాలోని ఓ రైల్వే స్టేషన్ లో పరిగెత్తుతున్నప్పుడు నా వెనుక సమంత కూడా పరిగెడుతుంది, కానీ ఆమె మధ్యలోనే కుప్పకూలిపోయింది, ఆ వెంటనే షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి సమంతకు ఏమైందో అని అందోళపడిన నన్ను రాజ్ అండ్ డీకే లు ఆమెకి ఏమి కాదని ధైర్యం చెప్పారు. ఆ వెంటనే సమంత కోలుకుని తిరిగి షూటింగ్ చేసింది.
హెల్త్ బాలేదని లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండొచ్చు. కానీ సమంత కమిట్మెంట్ కి కట్టుబడే మనిషి, ఆమె కష్టాలతో పోలిస్తే నావి చాలా చిన్నవి అంటూ వరుణ్ ధావన్ సమంత సిటాడెల్ షూటింగ్ లో పడిన ఇబ్బందులు బయటపెట్టాడు.