Advertisement
Google Ads BL

స్పిరిట్ లోకి ప్రభాస్ ఎంటర్ అయ్యేది అప్పుడే..


రీసెంట్ గా సందీప్ వంగ-ప్రభాస్ కలయికలో రాబోయే స్పిరిట్ మూవీ వచ్చే నెల అంటే డిసెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లబోతుంది అంటూ నిర్మాత భూషణ్ కుమార్ ఇచ్చిన అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ప్రభాస్ లైనప్ ఆయన స్పీడు చూసి ప్రభాస్ ఫ్యాన్స్ కి నిద్ర రావడం లేదు. రాజా సాబ్ తో పాటుగా హను రాఘవపూడి మూవీ షూటింగ్స్ చేస్తూ ప్రభాస్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. 

Advertisement
CJ Advs

మరోపక్క సలార్ 2 లైన్ లోకి రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సలార్ 2 షూట్ తో స్పిరిట్ మూవీ ఆలస్యమవుతుంది అనుకుంటే అది జనవరి లో మొదలవుతుంది అని, అది కూడా సంక్రాంతి తర్వాత ప్రభాస్ స్పిరిట్ రెగ్యులర్ షూట్ లో జాయిన్ అవుతారని, సందీప్ వంగ కూడా పొంగల్ తర్వాతే స్పిరిట్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారట. 

ప్రభాస్ ఈలోపు రాజా సాబ్, హను మూవీ, సలార్2 షూటింగ్స్ ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తే.. ఆ తర్వాత కూల్ గా స్పిరిట్ లోకి ఎంటర్ అవుతారేమో, అసలే ఏప్రిల్ నుంచి ప్రభాస్ కల్కి 2లోకి వెళ్లాల్సి ఉంది అంటూ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రభాస్ స్పీడు కన్నా ఆయన హార్డ్ వర్క్ చూసి తెగ ఇదైపోతున్నారు. 

Spirit Exclusive Update:

Prabhas Spirit To Kickstart Its Shoot Post Pongal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs