Advertisement
Google Ads BL

పెళ్లి రూమర్స్ పై అనుష్క ఫస్ట్ రియాక్షన్


అనుష్క శెట్టి.. ఘాటీ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వంలో సైలెంట్ గా ఘాటీ చిత్రాన్ని మొదలు పెట్టిన అనుష్క బర్త్ డే రీసెంట్ గానే జరిగింది. అనుష్క బర్త్ డే వచ్చినా లేదంటే ఆమె సినిమాలు విడుదలవుతున్న సందర్భంలో అనుష్క పెళ్లి రూమర్స్ చక్కర్లు కొడుతూ ఉంటాయి. 

Advertisement
CJ Advs

ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పటిది కాదు, వారు మేము స్నేహితులమని చెప్పినా జనం వినరు, ఇక కొన్నాళ్లుగా అనుష్క సినిమాలకు బ్రేకిచ్చేసి పెళ్ళికి సిద్ధమైంది. రాఘవేంద్రరావు కొడుకుతో అనుష్క పెళ్లి అని ఒకసారి, తల్లితండ్రులు చూసిన దుబాయ్ బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్ళికి సిద్దమవుతుందనే వార్త ఇంకోసారి వైరల్ అయిన నేపద్యంలో తాజాగా తన పెళ్లి రూమర్స్ పై రియాక్ట్ అయ్యింది అనుష్క. 

తన పెళ్లి రూమర్స్ విషయంలో తనకేమి బాధలేదు, కానీ పెళ్లి పెళ్లి అనేవారు ఆ పెళ్ళి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది చెప్పరు, పెళ్లి విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు, అది నేరమూ కాదు. అదో భావోద్వేగమైన విషయం, ఆ సమయం వస్తే నేనే చెబుతాను, ఇకనైనా ఇలాంటి రూమర్స్ ఆపండి అంటూ అనుష్క తన పెళ్లి రూమర్స్ పై ఫుల్ స్టాప్ పెట్టింది. 

Anushka first reaction to marriage rumours:

Anushka Shetty finally reacts to wedding rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs