Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ లైనప్ చూస్తే దిమ్మతిరగాల్సిందే


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాన్ ఇండియా హిట్ కొట్టారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత దేవర తో సక్సెస్ చూసిన ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీగా వున్న ఎన్టీఆర్ ఆ నెక్స్ట్ అంటే వచ్చే జనవరి నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ సెట్ లోకి అడుగుపెడతారు. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత ఎన్టీఆర్ దేవర పార్ట్2 చెయ్యాల్సి ఉంటుంది. ఆతర్వాత ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేస్తారనే ప్రచారం ఉంది, మరోపక్క వెట్రి మారన్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తే బావుంటుంది అని అభిమానుల కోరిక. మరి ఎన్టీఆర్ ఆలోచన ఎలా ఉందొ అనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. 

తాజా సమాచారం ప్రకారం NTR 33 కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ ను రెడీ చేసుకుంటున్నారనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్-నెల్సన్ ఇద్దరి మధ్య పలు దఫాల చర్చలు జరిగి.. స్టోరీ విషయంలో దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. 

ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది, మరిన్ని వివరాలు, విశేషాలు ఎన్టీఆర్ లైనప్ కు సంబంధించి మరో అప్ డేట్ లో.. 

NTR line-up is mind-boggling:

NTR to team with Nelson Dilip Kumar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs