Advertisement
Google Ads BL

రుక్మిణి వసంత్ కు బ్యాక్ టు బ్యాక్ షాక్ లు


రుక్మిణి వసంత్ ఈ మధ్యన అనూహ్యంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన హీరోయిన్. రష్మిక మాజీ లవర్ రక్షిత్ శెట్టి తో సప్తసాగరాలు దాటి సైడ్ ఏబిలో నటించిన రుక్మిణి వసంత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత కన్నడలో బఘీర, తెలుగులో అపుడో ఇపుడో ఎపుడో చిత్రాల్లో నటించడం, అవి బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ముందుకు రావడంతో ఈ అమ్మాయి తరచూ సోషల్ మీడియాలో హడావిడి చేసింది. 

Advertisement
CJ Advs

కన్నడలో ఆమె నటించిన బఘీర దీపావళి స్పెషల్ గా పాన్ ఇండియా లో విడుదల కాగా.. ఈ చిత్రం కన్నడలో యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మిగతా భాషల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ పాత్ర చూస్తే అందరూ అయ్యో పాపం అంటారేమో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ లో చూపించిన ఆమె పాత్రను సెకండ్ హాఫ్ లో ఎక్కడా హైలెట్ చెయ్యకుండా క్లైమాక్స్ లో చంపెయ్యడం ఆమె అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. 

మరోపక్క తెలుగులో 100 కోట్ల హీరో నిఖిల్ తో నటించిన అపుడో ఇపుడో ఎపుడో చిత్రం నిన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం విడుదలకు ముందు ఎంత బజ్ ఉందొ అలానే విడుదలయ్యాక అసలు సోదిలో లేకుండా పోయింది. డిజప్పాయింట్ రివ్యూలు, నిరాశపరిచే టాక్ తో వారం తిరిగేసరికి మరో ప్లాప్ ని రుక్మిణి వసంత్ తన ఖాతాలో వేసుకుంది. 

రెండు వారాల్లో రెండు ప్లాప్ లు కొట్టిన రుక్మిణి వసంత్ మరో వారం అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధమైంది. శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన భైరతి రణగల్ లో రుక్మిణి నటించింది. ఈ చిత్రం నవంబర్ 15 అంటే వచ్చే వారం విడుదల కాబోతుంది. దాని ఫలితమేమిటో చూడాలి మరి. 

Back to back shocks for Rukmini Vasanth:

Back to back flops for Rukmini Vasanth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs