Advertisement
Google Ads BL

ప్రభాస్ లుక్ లీక్ : కన్నప్ప టీమ్ హడావిడి


మంచు వారి నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప. డిసెంబర్ విడుదల అంటూ కన్నప్ప టీమ్ కామయినా మీడియా వదలట్లేదు. డిసెంబెర్ ను కన్నప్ప వదిలేసిందా అంటూ మాట్లాడుతుంది. మరోపక్క మంచు విష్ణు ఈ ప్రాజెక్ట్ కోసం డే అండ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప విషయమై ఆయన అమెరికాలోనే ఉన్నారు. 

Advertisement
CJ Advs

కన్నప్ప మూవీలో భారీ తారగణం నటిస్తుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ నటిస్తుండగా.. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడొక లీక్ సోషల్ మీడియాని షేక్ చేయగా.. కన్నప్ప టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాస్‌ శివుడి లుక్‌ను ఎవరో లీక్ చేసి దానిని ట్రెండ్ చేస్తున్నారు. 

దానితో వెంటనే అలెర్ట్ అయిన కన్నప్ప టీం ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. 

కన్నప్ప ప్రాజెక్ట్ కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము మా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాం. రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో కన్నప్ప నుంచి ఓ ఫోటో అనధికారికంగా లీక్ అయినందుకు బాధపడుతున్నాం. ఈ లీక్ మా కష్టాన్ని మాత్రమే కాదు.. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతిక్షణం కృషి చేస్తున్న 2 వేలమంది వీఎఫ్ఎక్స్ కళాకారుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. 

అసలు ఈ ఫోటో లీక్ ఎలా అయ్యిందనేది తెలుసుకోవడానికి మేము పోలీస్ కేసు పెట్టాము. దయచేసి ఈ ఫోటోను ఎవరూ షేర్ చేయొద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాము. దీనిని షేర్ చేసిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఫోటోను లీక్ చేసిన వారిని కనిపెట్టినవారికి రూ.5 లక్షల బహుమానం అందిస్తాం. మీరందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము.. అంటూ కన్నప్ప టీమ్ హడావిడిగా లేఖ విడుదల చేసింది. 

Prabhas look leaked: Kannappa team rush:

Prabhas Kannappa look leaked; makers offer 5L reward ...
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs