Advertisement
Google Ads BL

100 కోట్ల కోసం భాస్కర్ యుద్ధం


వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళ స్టార్  దుల్కర్ సల్మాన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్ లో వచ్చిన లక్కీ భాస్కర్ విడుదలకు ముందు పలుమార్లు వాయిదా పడినప్పటికీ దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 

Advertisement
CJ Advs

దీపావళికి విడుదలైన అమరన్, క చిత్రాలు కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికి.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం లక్కీ భాస్కర్ కి కనెక్ట్ అయ్యారు. మొదటి వీకెండ్ లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్లిన లక్కీ భాస్కర్ నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. మేకర్స్ కూడా సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ హడవిడి చేసారు. 

అయితే లక్కీ భాస్కర్ 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెడుతుందా, అసలు 100 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందా అనే క్యూరియాసిటీ ఇప్పుడు ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. సినిమా చూసిన వాళ్ళంతా లక్కీ భాస్కర్ సూపర్ హిట్ అంటున్నారు, మిగతా వాళ్లకు వెళ్లమని చెబుతున్నారు. వీకెండ్ లో ఇరగదీసిన లక్కీ భాస్కర్ వీక్ డేస్ డే టైం లో 30 పెర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా థియేటర్స్ లో నమోదు కావట్లేదు. 

తెలివితేటలతో 100 కోట్లను తన అకౌంట్ లో వేసుకుని అమెరికా వెళ్లి హాయిగా రిలాక్స్ అయిన లక్కీ భాస్కర్ 100 కోట్లు కొట్టి చూపిస్తాడా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 

మరి నిన్న శుక్రవారం విడుదలైన సినిమాలన్నీ పూర్తిగా నిరాశపరిచాయి. ఈ వీకెండ్ లోను సత్తా చాటి లక్కీ భాస్కర్ 100 కోట్లకు చెరువుతుందేమో చూద్దాం. 

Bhaskar battle for 100 crores:

Lucky Bhaskar box office collection
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs