ఏపీలో విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయంటూ ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వైసీపీ గోల మొదలు పెట్టింది. ఎన్నికలు ముసిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఐదు నెలలు తిరక్కుండానే కరెంట్ బిల్లులతో గృహిణులకు చుక్కలు చూపిస్తున్నారంటూ వైసీపీ గగ్గోలు మొదలు పెట్టింది. మూడు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చి విద్యుత్ చార్జీలు బాదుతున్నారు అంటూ విమర్శిస్తున్నారు.
ఈ విషయంలో చంద్రబాబు కూడా కరెంట్ చార్జీల పెంపు విషయాన్ని ఒప్పుకుంటున్నారు కానీ గత ప్రభుత్వమంటే జగన్ ప్రభుత్వం చేసిన విద్యుత్ బకాయిలు చెల్లించడానికే విద్యుత్ చార్జీలు పెంచాల్సి వస్తుంది తప్పదంటూ చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి దొరికిన చోటల్లా అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల అప్పుల భారం వేశారని చంద్రబాబు తిరిగి వైసీపీ నే విమర్శిస్తున్నారు.
అమరావతిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, ఇప్పుడు మొదలుపెట్టిన సబ్ స్టేషన్లు ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు విద్యుత్ చార్జీల పెంపుపై ఇచ్చిన క్లారిటీ పై కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల లాంతర్ తో నిరసన తెలిపింది. దీనిపై ఏపీ ప్రజలేమంటారో చూడాల్సి ఉంది.