అవును.. మీరు వింటున్నది నిజమే. యువనేత, మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ మాట ఎవరో కాదు చెప్పేది స్వయాన టీడీపీలోని కొందరు ముఖ్య నేతలు, లోకేష్ అత్యంత సన్నిహితులే. లోకేష్ ఎందుకు సీఎం కావాలి..? ఏ పరిస్థితుల్లో అవుతున్నారు అనేందుకు కూడా గట్టి కారణాలే చెబుతున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్రతో పాటు పలు విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
సీజన్ వచ్చేసిందా..?
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫిక్స్ అయిన కేంద్రం, బిల్లు మాత్రమే పాస్ కావాల్సి ఉంది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పాస్ చేసుకోవడానికి సన్నాహాలు మొదలయ్యాయి. దీనికి తోడు మహారాష్ట్ర, ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో పరిస్థితులను బట్టి తేదీలు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేసిందా అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కూటమి, వైసీపీ మధ్య నడుస్తున్న మాటల తూటాలు ఎన్నికలను తలపిస్తున్నాయి.
ఇదీ అసలు సంగతి
జమిలి ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025 ఆఖరులో లేదా 2026 ప్రారంభంలో యువనేత నారా లోకేష్ ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు లీకులు కూడా తిన్నగా టీడీపీ శ్రేణులు వదులుతున్నాయి. ప్రస్తుతం ఇదే టీడీపి సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. కొందరు పక్కాగా అని పోస్టులు పెడుతుంటే.. ఇంకొందరు ఏమో ఇది ప్రచారం, రూమర్ మాత్రమే అని చెప్పుకుంటున్న పరిస్థితి. అందుకే వీలైనంత త్వరగా తాను సీఎంగా చేయాలనుకున్న పనులు అన్నీ ముగించాలని నారా చంద్రబాబు భావిస్తున్నారట. ఇందులో ముఖ్యంగా అమరావతి పనులు, పోలవరం, కొన్ని బిల్లులు మరీ ముఖ్యంగా శాంతిభద్రతలు అన్నీ సెట్ రైట్ చేయడానికి సీఎం సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఇందుకేనా పవన్ ఆగ్రహం..!
వాస్తవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇందుకే ఆగ్రహంగా ఉన్నారని.. టీడీపీ, మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలపై డైరెక్ట్ అటాక్ చేస్తున్నట్లుగా సమాచారం. చినబాబును సీఎం చేస్తే నేను ఎందుకు ఊరుకుంటా? అని గుర్రుగానే ఉన్నారట. అన్నీ చేసింది నేను.. కూటమి గెలవడానికి కారణం నేను.. ఇంత చేస్తే పదవులు అనుభవించేది మీరా..? అంటూ కన్నెర్ర చేశారట. దీనికి తోడు ఈ మధ్య కూటమిలో కుమ్ములాటలు ఎక్కవ అవుతున్న పరిస్థితులు. ఈ పరిమాణాలు అన్నీ లోకేష్ సీఎం అవ్వడానికే అనే సంకేతాలని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో నిజానిజాలు ఎంతో.. ఏం జరుగుతుందో చూడాలి మరి.