Advertisement
Google Ads BL

మధురానగర్ టెంపుల్ లో జాన్వీ పూజలు


మొదటి సౌత్ ఇండియా చిత్రం దేవర తోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న జాన్వీ కపూర్ రామ్ చరణ్ తో RC 16 సెట్స్ లోకి జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతుంది. దేవర పార్ట్1లో జాన్వీ పాత్ర అంతగా లేకపోయినా దేవర 2లో జాన్వీ కపూర్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది, ఆమె పాత్ర హైలెట్ అవుతుంది అని తెలుస్తోంది.

Advertisement
CJ Advs

ఇక RC 16 లోను జాన్వీ కపూర్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందట. దర్శకుడు బుచ్చిబాబు చరణ్ పాత్ర ని శివ రాజ్ కుమార్ పాత్రను హైలెట్ చెయ్యడమే కాకుండా జాన్వీ కపూర్ పాత్రకి ప్రాధాన్యత ఇస్తున్నాడట. త్వరలో మొదలు కాబోయే RC 16 మొదటి షెడ్యూల్ లో జాన్వీ కపూర్ కూడా పాల్గొంటుంది అని టాక్ ఉంది.

అయితే తాజాగా జాన్వీ కపూర్ హైదరాబాద్ వచ్చింది. ఆమె ఏదో షూటింగ్ కోసం హైదరాబాద్ రాలేదు. హైదరాబాద్ లోని మధురానగర్ లో ఉన్న ప్రసిద్ధ ఆంజనేయ స్వామి టెంపుల్ లో పూజలు చేసేందుకు జాన్వీ ముంబై నుంచి ప్రత్యేకంగా వచ్చింది. హనుమాన్ దేవాలయంలో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు చెయ్యగా... ఆలయ అర్చకులు జాన్వీ కపూర్ కు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇక జాన్వీ కపూర్ కి దేవుళ్లంటే ఎంత ఇష్టమో తరచూ ఆమె తిరుమల కొండకి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం చూస్తుంటాము. ఇప్పుడు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని జాన్వీ దర్శించుకుంది. జాన్వీ మధురానగర్ గుడికి రావడంతో ఆమెని చూసేందుకు అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. 

Janhvi performed Pooja in Hyderabad Temple:

Janhvi Kapoor performed special pooja at Hanuman temple In Maduranagar 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs