Advertisement
Google Ads BL

పుష్ప 2: దేవిశ్రీ తో సుకుమార్ కు చెడిందా..


ఒకపక్క పుష్ప 2 ద రూల్ పై మేకర్స్ అంచనాలు పెంచేలా పోస్టర్స్ వదులుతున్నారు. సినిమా రిలీజ్ అవడానికి సరిగ్గా నెల రోజుల సమయమే ఉంది. పుష్ప ద రూల్ ట్రైలర్ సమయం ఆసన్నమైంది. మరోపక్క పుష్ప 2 లో లుకలుకలు విడుదలకు ముందు అల్లు డ్యాన్స్ ను అయోమయానికి గురి చేస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఈ ఏడాది మిడిల్ లో సుకుమార్ కు అల్లు అర్జున్ కు మధ్యన ఈగో క్లాష్ వచ్చింది.. దానితో ఇద్దరూ ఒకరికి ఒకరు సంబంధం లేకుండా విదేశీ ట్రిప్స్ వేశారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి, కానీ అంతలోనే ప్యాచప్ అయ్యింది.. పుష్ప షూటింగ్ సక్రమంగా పూర్తి కావొచ్చింది. కానీ ఇప్పడు సినిమా రిలీజ్ అవడానికి ముందు ఇప్పుడొక న్యూస్ అల్లు ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తుంది. 

పుష్ప పార్ట్ 1కి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ కి సుకుమార్ కి చెడింది అనేది ఈ వార్త సారాంశం. పుష్ప 2కి BGM దేవిశ్రీప్రసాద్ కాకుండా థమన్ అందిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలు చూసి అందరూ షాకవుతున్నారు. అసలు దేవిశ్రీ ప్లేస్ లోకి థమన్ ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. 

పాటలకు ఓ మ్యూజిక్ డైరెక్టర్, BGM కు మరో మ్యూజిక్ డైరెక్టర్ అంటే కొత్త కాదు కానీ.. సుకుమార్ నమ్మిన దేవిశ్రీ ప్లేస్ లోకి థమన్ రావడమే షాకింగ్. అయితే దేవిశ్రీ అనుకున్న సమయానికి మ్యూజిక్ అందించకపోవడంతోనే తమన్ ఎంటర్ అయినట్లుగా తెలుస్తోంది. అసలు నిజమేమిటో వాళ్ళకే తెలియాలి.  

Pushpa 2: Did Devishri and Sukumar get hurt..:

Pushpa The Rule: Sukumar and Devi Sri Prasad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs