నిజమే కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారిన జనసేన అధ్యక్షుడు పవన్ టీడీపీ వాళ్లకు ఎప్పటికైనా ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు. పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో గెలిచిన జనసేన పార్టీ కి చంద్రబాబు చాలా విలువ ఇస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కు అడుగడుగునా గౌరవం ఇవ్వడం వెనుక చంద్రబాబు తెలివి గురించి మాట్లాడుకున్నారు.
కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ ను ఒకవేళ పక్కన పెడితే తనపై నెగిటివిటి రావొచ్చు, పవన్ కళ్యాన్ శక్తి పెరగొచ్చు, అది టీడీపీ కి ఎప్పటికైనా ప్రమాదం అని బాబు గారు భావించే పవన్ కళ్యాణ్ కు తనతో సమానమైన స్తానం ఇస్తూ కాపు కమ్యూనిటీలో మంచి పేరు తెచ్చుకున్నారు. పవన్ ని నెగ్లేట్ చేస్తే తమకు ముప్పు పొంచి ఉంటుంది.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ హోం మినిస్టర్ అనితపై చేసిన వ్యాఖ్యల విషయంలోనూ చంద్రబాబు గమ్మునున్నారు. పవన్ కళ్యాణ్ ను కదిపితే ఇబ్బందులొస్తాయి అని ఆయన భావించి ఉండొచ్చు. అందుకే పవన్ వ్యాఖ్యలపై ఆయన మిన్నకుండిపోయారు. ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ పవన్ తో ప్రమాదం పొంచి ఉంది.
ఆయనను పక్కనపెట్టుకుంటే ప్రమాదాన్ని మోస్తున్నట్టే అంటూ టీడీపీ నేతల్లో అప్పుడే గుసగుసలు మొదలైపోయాయి. మరి ఎన్ని విమర్శలొచ్చినా చంద్రబాబు-పవన్ కళ్యాణ్ స్నేహం ఇలానే ఉండాలని టీడీపీ లోనే మరికొంతమంది కోరుకోవడం గమనార్హం.