Advertisement
Google Ads BL

ఐఫా వేడుకలో రానా ను తిట్టిన బాలయ్య


రీసెంట్ గా అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుక అనేది ఏ యూట్యూబ్ నుంచి కానీ ఏ తెలుగు ఛానల్ నుంచి కానీ బయటికి రాకపోయినా.. కొన్ని వీడియో క్లిప్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ షో కి యాంకర్లుగా వ్యవహరించిన హీరోలు రానా-తేజ సజ్జలు కొంతమంది హీరోలపై సరదాగా చేసిన కామెంట్స్ పై ఆయా హీరోల ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

Advertisement
CJ Advs

ముఖ్యంగా సమంత స్టేజ్ పైకి రాగానే ఒకప్పుడు మరదలు పిల్ల, ఇప్పడు సిస్టర్ గా మారింది అని ఆటపట్టించిన రానా.. అరె తేజ గేమ్ ఛేంజర్ పెరత్తకు ఐదేళ్లకొకసారి ఐఫా జరుగుతుంది.. అదే గేమ్ ఛేంజర్ తో పెట్టుకుంటే మరో రెండేళ్లు ఏమి ఉండదంటూ రానా చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ కు కోపాన్ని తెప్పించాయి. 

ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ తో హిట్టు కొట్టిన తేజ సజ్జ విషయంలో మహేష్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ ఈవెంట్ లో తేజ సజ్జ ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీట్ వదిలేస్తే, ఆంజనేయస్వామిని కూడా ఓటిటి లో చూద్దామని వదిలేసారు అంటూ చేసిన కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కు చిరాకు తెప్పించాయి. 

ఇక రానా సరదాగా స్టేజ్ పై నుంచి మన అన్ స్టాపబుల్ బాలయ్యకు ఫోన్ చేద్దామని చేసి బ్రో నమస్తే అనగానే.. నమస్కారం అన్నారు బాలయ్య. అబుదాబి వచ్చారటగా నాతొ ఐఫా ఉత్సవ్ చేస్తారా అనగానే ఎవడ్రా నువ్వు అన్నారు. సర్ లైవ్ లో ఉన్నాము నేను రానా ను అనగానే అది చెప్పు ముందు గాడిద  అంటూ బాలయ్య రానా ను తిట్టేసిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక ఐఫా స్టేజ్ పై జై బాలయ్య అంటూ రానా చేసిన హంగామా నందమూరి అభిమానులకు కిక్ ఇచ్చింది. 

Rana and Teja IIFA Punches Ignite Fan Fury:

IIFA Utsavam 2024 highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs