ఇపుడు వైసీపీలో ఉంటే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఎక్కడ లోపలేస్తుందో అని చాలామంది వైసీపీ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది ఎప్పుడెప్పుడు వైసీపీ కి రాజీనామా చేసి టీడీపీ, జనసేనలో చేరుదామా అని చూస్తుంటే మరికొందరు ఇప్పటికే వైసీపీ ని వదిలేసి టీడీపీ, జనసేన పార్టీలలో జాయిన్ అయ్యారు.
ఇక ఇప్పుడు జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ లు కూడా వైసీపీ ని వీడుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కీలక పాత్రధారి జోగి రమేష్ పై కేసు నమోదు కావడమే కాదు, ఇప్పటికే విచారణకు హాజరవుతున్న జోగి రమేష్ కేసు ల నుంచి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ లోకి జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడనే వార్త చూసి బ్లూ మీడియా కథనాలు స్టార్ట్ చెయ్యడమే కాదు..
ఒకవేళ కేసులకు భయపడి టీడీపీ లో జాయిన్ అయితే గనక వారు రాజకీయంగా తొక్కేస్తారు. ఇప్పుడు రమ్మని ఆహ్వానిస్తారు, తర్వాత రాజకీయ సమాధి చేస్తారు. జోగి రమేష్ టీడీపీ లో చేరినా అక్కడ సముచిత స్థానం దక్కదు అంటూ కథనాలు స్టార్ట్ చేసి భయపెట్టడానికి రెడీ అయ్యింది.
టీడీపీ లోకి జోగి రమేష్ ని ఆహ్వానించి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సజ్జల పేరు, జగన్ పేరుని జోగి రమేష్ తో చెప్పించాలని ఎత్తుగడ టీడీపీ వాళ్ళు వేస్తున్నారు అంటూ జోగి రమేష్ ముందరకాళ్లకు బంధం వేస్తుంది వైసీపీ బ్లూ మీడియా.