2024 ఎలెక్షన్ కోడ్ సమయంలో తన స్నేహితుడు, వైసీపీ నేత శిల్ప రవిని కలిసేందుకు నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ కు నంద్యాల పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా నంద్యాల నియోజకవర్గంలో అల్లు అర్జున్ పర్యటించడంతో అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు.
ఎన్నికల ముగిసిన తర్వాత అల్లు అర్జున్ తనపై నంద్యాల పోలీసులు పెట్టిన కేసుని క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసుకు సంబందించిన తీర్పు వెలువరించింది.
ఈ కేసులో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చేలా ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనపై నమోదయిన కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించడంతో.. అల్లు అర్జున్ పెద్ద టెన్షన్ నుంచి బయటపడ్డాడు. తీర్పు తనకు అనుకూలంగా రావడంతో ఆయన కూల్ అయ్యాడు.