యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ లేటెస్ట్ పాన్ ఇండియా ఫిలిం దేవర చిత్రం సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో విడుదలై నెగెటివ్ టాక్ తోనే 500 కోట్లు కొల్లగొట్టింది. ఎన్టీఆర్ స్టామినా తో దేవర బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తన సినిమాని హిట్ చేసారు అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు.
ఇక దేవర ఓటీటీ రైట్స్ ను భారీ డీల్ తో నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఎనిమిది వారాల గ్యాప్ తో ఓటీటీ లో విడుదల చెయ్యాలని భావించినా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ దేవర ని నవంబర్ 8 నుంచే తెచ్చెందుకు ఏర్పాట్లు చేస్తుంది. కాదు చేసేసింది. కొద్దిరోజులుగా దేవర ఓటీటీ పై ప్రేక్షకుల్లో నడుస్తున్న ఇంట్రెస్ట్ మాములుగా లేదు.
అది దృష్టిలో పెట్టుకునే నెట్ ఫ్లిక్స్ లో దేవర ఈ నవంబర్ 8 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా ప్రకటించారు. ఇక మరో మూడు రోజుల్లోనే దేవర చిత్రం నెట్ ఫ్లిక్స్ నుంచి నేరుగా ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది.