Advertisement
Google Ads BL

తప్పు సరిదిద్దుకున్న త్రివిక్రమ్


త్రివిక్రమ్ అరవింద సమెత సమయంలో ఈషా రెబ్బకి, అలా వైకుంఠపురములో సమయంలో నివేత పేతురాజ్ కు, గుంటూరు కారం అప్పుడు మీనాక్షి చౌదరికి చాలా అన్యాయం చేసారు. ఈముగ్గురు సెకండ్ హీరోయిన్స్ కేరెక్టర్ చేసి చిన్నబోయారు. త్రివిక్రమ్ కూరలో కర్వేపాకు మాదిరి ఈ సెకండ్ హీరోయిన్ కేరెక్టర్స్ ని చూపించారు. 

Advertisement
CJ Advs

అయితే మీనాక్షిచౌదరికి గుంటూరు కారంలో చిన్న కేరెక్టర్ ఇచ్చి తప్పు చేసిన ఆయన లక్కీ భాస్కర్ కి మీనాక్షిని దర్శకుడు వెంకీ అట్లూరి కి సజెస్ట్ చేసి తన తప్పుని సరిదిద్దుకున్నారు. వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ స్క్రిప్ట్ తో వచ్చినప్పుడు హీరోయిన్ గా మీనాక్షి చౌదరి పేరుని త్రివిక్రమ్ గారు, నాగవంశీ గారు సజెస్ట్ చేసారు. 

మీనాక్షి నిజంగా సుమతి పాత్రకు ప్రాణం పోసింది అంటూ వెంకీ అట్లూరి ఈ ప్రాజెక్టులోకి మీనాక్షి త్రివిక్రమ్ గారు చెబితేనే వచ్చింది అనేది లక్కీ భాస్కర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో రివీల్ చేసారు. 

గుంటూరు కారంలో మీనాక్షి స్క్రీన్ ప్రెజెన్స్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. కానీ నిడివిని దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ మీనాక్షి సీన్స్ లేపేశారు. సో అప్పటి మిస్టేక్ ని ఇలా బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ లక్కీ భాస్కర్ లో తీసుకునేలా వెంకీ కి సలహా ఇచ్చి మీనాక్షికి పరోక్షంగా త్రివిక్రమ్ హెల్ప్ చేశారు. 

Trivikram suggested Meenakshi Chaudhary :

Trivikram Srinivas suggested Meenakshi Chaudhary for the role in the movie Lucky Bhaskar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs