Advertisement
Google Ads BL

పొంగులేటిపై బాంబ్ లాంటి వార్త.. నిజమా?


తెలంగాణ రాజకీయాల్లో కాదేదీ పుకార్లకు అనర్హం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఐతే సీఎం రేవంత్ రెడ్డి.. లేదంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం రేవంత్ అయితే.. తర్వాతి స్థానంలో పొంగులేటి ఉన్నారు. ఇది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజమే. అందుకే వారంలో ఒక్కసారైనా ఈ ఇద్దరిపైన ఏదో ఒక రూపంలో లేనిపోని ఆరోపణలు, రూమర్స్ పుడుతుంటాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళితే చాలు.. అదిగో రేవంత్ పని ఐపోయింది.. ఇదిగో సీఎంను మార్చేస్తున్నారు అని లేనిపోని సందేహాలు పుట్టించేలా వార్తలతో ప్రత్యర్థులు పుట్టిస్తూ ఉండటం పరిపాటిగా వస్తోంది. ఇప్పుడిక పొంగులేటి వంతు వచ్చినట్టు ఉంది. 

Advertisement
CJ Advs

అసలేం జరుగుతోంది..?

పొంగులేటి ఓవర్ చేయకు..! మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత అన్నదే ఆ వార్తల సారాంశం. మంత్రి తీరుతో తీవ్ర ఆగ్రహంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఆ పుకారులో ఉంది. పొంగులేటిని పట్టలేక ఆయన తీరుపై హైకమాండ్‌కు పలువురు సీనియర్ నేతల ఫిర్యాదు చేశారట. సీఎం రేవంత్ తర్వాత నెంబర్ 2 తానే అనేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు పేర్కొన్నారట. పొంగులేటిని కంట్రోల్ చేయకుంటే ప్రభుత్వానికి నష్టమని హైకమాండ్‌కు సూచన చేశారట. ప్రభుత్వంలో సొంత కంపెనీకి కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారని ఆరోపణలు ఉండటం గమనార్హం. అన్ని విషయాల్లో పొంగులేటి కలుగజేసుకోవడంపై నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

ఓహో ఇందుకేనా..?

వాస్తవానికి పొలిటికల్ బాంబ్ అంటూ పొంగులేటి గత కొన్ని రోజులుగా ఒక్కో బాంబ్ వదులుతున్నారు. ఈ బాంబుల ధాటికి తట్టుకోలేక బీఆర్ఎస్ సోషల్ మీడియా.. ఆ పార్టీ తాలూకు యూట్యూబ్ ఛానెల్స్ ఇలా రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతే కాదు కొందరు బీఆర్ఎస్ డైహార్డ్ ఫ్యాన్స్ ఇలా పొంగులేటి గురుంచి ఇష్టానుసారం రాస్తున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పొంగులేటి దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు అంటూ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు బూమరాంగ్ అయ్యాయని చర్చ నడుస్తోంది అంటూ రివర్స్ ఎటాక్ చేస్తోంది బీఆర్ఎస్. అంతేకాదు.. పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో అబాసుపాలైన ప్రభుత్వం అని హడావుడి మొదలుపెట్టింది.

కంట్రోల్ చేయపోతే ఎలా?

పొంగులేటి ద్వారా ఆగస్టు సంక్షోభం వస్తుందని అప్పట్లోనే బీఆర్ఎస్, బీజేపీ పెద్ద ఎత్తున హడావుడి చేశాయి. ఆగస్టు పోయి.. నవంబర్ వచ్చినా అబ్బే అదేమీ జరగలేదు. చూశారుగా.. రెండు రోజులకోసారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులపై చేస్తున్న వార్తలు.. పుకార్లపై ఇప్పటికైనా పోయేదేమీ లేదు. గట్టిగా నిఘా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ఇలాంటి వార్తలు, పుకార్లు సృష్టించాలంటే భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. కాంగ్రెస్ అధికారం ఉంది గనుక ఇలాంటి వాటికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టాలి. అవసరం ఐతే ఇలాంటి వ్యవహారాలపై ప్రత్యేకంగా యాక్ట్, లేదా ఇవన్నీ చూసుకోవడానికి ఐపీఎస్ అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్, జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలోనే ఉన్నాయ్. అందుకే.. ఈ రూమర్ మాస్టార్లకు ఫుల్ స్టాప్ పెట్టి తీరాల్సిందే.

 

 

The news is like a bomb on Ponguleti.. is it true?:

Opposition to Minister Ponguleti Srinivas Reddy with his own party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs