Advertisement
Google Ads BL

ఐటెం సాంగ్స్ పై సమంత కామెంట్స్ వైరల్


నాగ చైతన్య కు విడాకులిచ్చిన వెంటనే సుకుమార్ తనకు పుష్ప ద రైజ్ లో అల్లు అర్జున్ సరసన కాలు కదిపేందుకు ఇచ్చిన స్పెషల్ సాంగ్ అవకాశాన్ని ఓకె చేసి అందరికి షాకిచ్చింది సమంత. ఆ సాంగ్ లో సమంత వేసిన స్టెప్స్ ఒక ఎత్తు, ఆమె అందాల ఆరబోత మరో ఎత్తు.. ఇదంతా నాగ చైతన్య మీద కోపం తోనే సమంత అలా ఐటమ్ సాంగ్ చేసింది అన్నారు, అనుకున్నారు. 

Advertisement
CJ Advs

అప్పటి నుంచి సమంతకు ఎన్ని ఐటమ్ ఆఫర్స్ వచ్చినా మరోసారి ఐటమ్ సాంగ్ చెయ్యలేదు. కానీ అందాల ఆరబోత, గ్లామర్ షో లో మాత్రం వేరే లెవల్ చూపిస్తుంది. ప్రస్తుతం సమంత సిటాడెల్ హనీ-బన్నీ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ను ఓ యాంకర్ మీరు మరోసారి స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వస్తే ఊ అంటారా లేదంటే ఉహు అంటారా అని సమంత ను అడిగారు. 

దానికి సమంత కొద్దిగా అలోచించి ఉహు అంటాను అంటూ ఇకపై తాను స్పెషల్ సాంగ్స్ చెయ్యను అని ఈ ఒక్క మాటతో తేల్చేసింది. ఇక సమంత-వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటాడెల్ హనీ-బన్నీ వెబ్ సీరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి రాబోతుంది. 

Samantha comments on item songs went viral:

Samantha rules out item numbers in movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs