Advertisement
Google Ads BL

సెకండ్ మ్యారేజ్ వార్తలపై అభిషేక్ క్లారిటీ


అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ఇప్పటిది కాదు, చాలా ఏళ్ళ నుంచి నడుస్తున్న న్యూసే. ఐష్.. అత్తగారు జయాబచ్చన్ పై కోపంతో అమితాబ్ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి తల్లి, తన కుమార్తె తో కలిసి ఉంటుంది అనే వార్తలు ఇప్పటివి కావు. మరోపక్క ఐష్ ఓ డాక్టర్ తో క్లోజ్ గా ఉండడం అభిషేక్ కి నచ్చలేదు. 

Advertisement
CJ Advs

అందుకే ఐశ్వర్యతో విడిపోవాలనుకుంటున్నాడంటూ బి టౌన్ కోడై కూసింది. ఈ విడాకుల వార్తలను అభిషేక్ బచ్చన్ ఎన్నోసార్లు కొట్టిపారేసినా.. ఆ వార్తలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ దస్వీ మూవీలో కలిసి నటించిన నిమ్రత్ కౌర్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఈమధ్యనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. 

ఐశ్వర్యకి విడాకులిచ్చాకే నిమ్రత్ కౌర్ ని అభిషేక్ బచ్చన్ వివాహం చేసుకుంటాడనే వార్త సంచలనంగా మారింది. తాజాగా అభిషేక్ ఈ వార్తలపై ఫుల్ ఫైర్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నేను ఐష్ తో విడాకులు తీసుకొంటున్నామనే వార్త నా చెవిన పడింది. ఈ వార్తను నాకు పంపినందుకు థ్యాంక్స్. అలాగే నా రెండో పెళ్లి ఎప్పుడో దయచేసి మీరే తెలపండి. నా రెండోపెళ్లెప్పుడో చెబితే మీకు రుణపడి ఉంటాను అని అభిషేక్ సెటైరికల్ గా వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.  

మరి అభిషేక్ బచ్చన్ పదే పదే విడాకుల వార్తలపై క్లారిటీ ఇస్తున్నా ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు..  కారణం ఏమిటో అంటూ నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. 

Abhishek Clarity on Second Marriage News:

Abhishek Bachchan shares his thoughts on second marriage amidst ongoing divorce news
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs