తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చిన ఎనుముల రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే యోచనలో హైకమాండ్ భావిస్తోందా..? రేవంత్ స్థానంలో మరో సీనియర్ నేతను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని ప్లాన్ నడుస్తోందా?
అసలు రేవంత్ పార్టీ మారితే పరిస్థితి ఏంటి..? ఆయన వెంట ఎంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇతర ముఖ్య నేతలు జంప్ అవుతారు? అనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం ఇంటర్నల్ సర్వే చేసిందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సర్వే రాష్ట్ర రాజకీయాల్లో, మీడియా.. సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తోంది.
సర్వేలో ఏముంది..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పిస్తే పరిస్థితి ఎలా ఉండబోతోంది..? ఎంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ వర్గంగా ఉన్నారు..? ఒకవేళ ఆయన పార్టీ మారితే ఎంతమంది ఆయన వెంట వెళ్తారు..? మంత్రివర్గంలో ఎంతమంది రేవంత్ వర్గం ఉన్నారు..? ఈ అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఇంటర్నల్ సర్వే చేయించుకున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఐతే ఈ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయట. ఈ ఫలితాలు చూసి సీనియర్ మంత్రులు, రేవంత్ వ్యతిరేఖ వర్గం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందట.
వామ్మో.. ఒక్కరేనా..!
సంచలన సర్వేలో మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి పక్షాన ఒకే ఒక్కరు సీతక్క మాత్రమే ఉన్నారట. మిగిలిన జూనియర్, సీనియర్ మంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరూ ముఖ్యమంత్రితో కలిసి నడవడానికి సిద్ధంగా లేరట. అంతే కాదు 65 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ఐదు నుంచి ఎనిమిది మంది మాత్రమే రేవంత్ వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారట. వాస్తవానికి మొదట్లో రేవంత్ వర్గం 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఐతే క్రమేణా పరిస్థితుల రీత్యా, రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలతో బలం, బలగం భారీగా తగ్గిపోయిందని తెలిపోయిందట. ఈ సర్వేతో రేవంత్ పార్టీలో ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండదని తెలిసిందట.
నిజమే చెబుతున్నా..!
వాస్తవానికి రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు సీఎంగా ఉండరని బీఆర్ఎస్, బీజేపీ జోస్యం చెబుతూనే వస్తున్నాయి. దీనికి తోడు ఏ క్షణం అయినా సర్కార్ పడిపోతుందని.. పెద్ద పెద్ద తలకాయలు చెబుతూ వస్తుండటం గమనార్హం. తాజాగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. 2025 జూన్ లేదా డిసెంబర్ నెలలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తారన్నది ఆ కామెంట్స్ సారాంశం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం గమనార్హం. ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కనీసం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని మహేశ్వర్ చెప్పుకొచ్చారు. రేవంత్ ఢిల్లీకి 7 సార్లు వెళ్లారు.. కానీ రేవంత్ రెడ్డికి ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. రేవంత్.. కనీసం ప్రియాంక గాంధీని కూడా కలవాలని వయనాడ్ వెళ్లినా దర్శన భాగ్యం కలగలేదని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం గమనార్హం.
ఎందుకిలా..?
చూశారుగా.. రేవంత్ గురుంచి, ఆయన స్థానంలో ఎవరు దానిపై పెద్ద ఎత్తునే చర్చలు నడుస్తున్నాయి. వాస్తవానికి రేవంత్ మీద ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా హడావుడిగా నడుస్తున్న పరిస్థితుల్లో డైవర్షన్ కోసం ఇలాంటివి ప్రత్యర్థుల నుంచి రావడం పరిపాటిగా మారుతోంది. ఐతే ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి ఇంతకు మించి ప్రత్యర్థి పార్టీలకు రేవంత్ గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు. తాజాగా వస్తున్న ఈ సర్వే వార్తల్లో నిజం ఎంత..? చివరికి కాంగ్రెస్ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుంది..? ఇందులో నిజానిజాలు ఎంత..? అనేది తెలియాల్సి ఉంది.