Advertisement
Google Ads BL

నందమూరి ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు


నిన్నటివరకు నందమూరి అభిమానులు చాలా ఉత్సహపడ్డారు. కారణం నందమూరి వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రానికి సిద్దమవడమే కాదు, అఫీషియల్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ ని చూజ్ చేసుకోవడం, ఫస్ట్ లుక్ వదలటం అన్ని అభిమానులను  ఎగ్జైట్ చేసాయి. అయితే ఇప్పుడు వారి ఉత్సహం మీద నీళ్లు చాల్లే విషయాలు సోషల్ మీడియాలో కాన వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

హనుమాన్ కు సీక్వెల్ గా PVCU నుంచి రాబోతున్న జై హనుమాన్ పనులు చురుకుగా సాగడంతో నందమూరి అభిమానులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే కాదు ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరూ సర్ ప్రైజ్ అయితే నందనమూరి అభిమానులు మాత్రం తెగ డిజప్పాయింట్ అవుతున్నారు. 

ప్రశాంత వర్మ ఎక్కువగా తన ఫోకస్ అంతా జై హనుమాన్ పై ఉంచితే మోక్షజ్ఞ మూవీని ఏం చేస్తాడు, ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతాడు, అసలు మోక్షజ్ఞ మూవీ విషయంలో ఉండాల్సిన తొందర జై హనుమాన్ విషయంలో ఎందుకు చూపిస్తున్నాడు ఇదే నందమూరి అభిమానులను తొలిచేస్తున్నప్రశ్న, 

మరి వీటికి సమాధానంగా నందమూరి అభిమానుల కోసం మోక్షజ్ఞ సినిమా మొదలు పెట్టేసి రెగ్యులర్ షూటింగ్ తేదీ ఏమైనా ప్రశాంత్ వర్మ ప్రకటిస్తాడేమో చూడాలి. 

Nandamuri fans are getting confused:

Prasanth Varma Jai Hanuman status
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs