Advertisement
Google Ads BL

తొక్కి పట్టి నార తీస్తా.. వైసీపీకి పవన్ వార్నింగ్


నేనున్నాను.. షర్మిలకు పవన్ భరోసా

Advertisement
CJ Advs

వైసీపీపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా మాట తీరు మార్చేశారు. ఎంతలా అంటే.. అప్పట్లో అథ:పాతాళానికి తొక్కిపడేస్తానని మాట్లాడారో, ఇప్పుడు అంతకుమించి మాట్లాడిన పరిస్థితి. అంతేకాదు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య నెలకొన్న ఆస్తి వివాదాల ప్రస్తావన కూడా తెచ్చారు. పరోక్షంగా నీకు నేనున్నా షర్మిల అంటూ చెప్పేశారు సేనాని. ఈ మాటలన్నింటికీ ఏలూరు జిల్లాలో జన్నాథపురంలో పవన్ కల్యాణ్ పర్యటనలో భాగంగా జరిగిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం వేదిక అయ్యింది.

నేనున్నాననీ..

అన్న అన్యాయం చేశాడు.. దుర్మార్గుడు, ఆస్తిలో సగం నాకు ఇవ్వాల్సిందే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అన్నకు తాను ఎంతో చేశానని, ఆఖరికి ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడలేదని ఆవేదన చెందుతున్నారు. అవును షర్మిల చెప్పేది అక్షరాల నిజమేనని, ఆస్తి సగం రావాల్సిందేనని తల్లి వైఎస్ విజయమ్మ కూడా లేఖ విడుదల చేశారు. దీంతో వైఎస్ ఫ్యామిలీ వివాదం రోజురోజుకూ ముదిరినట్లయ్యింది. ఇప్పట్లో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ షర్మిలకు భరోసా ఇచ్చారు. షర్మిల ప్రాణ రక్షణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటే.. తానే స్వయంగా సీఎం చంద్రబాబుతో మాట్లాడి రక్షణ కల్పిస్తామన్నారు. మొత్తానికి చూస్తే.. షర్మిలకు ఏదో జరుగుతుందని ముందే ఊహించిన పవన్.. పరోక్షంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఎవర్నీ వదలను

వైసీపీ చేసిన తప్పుడు విధానాలతో వ్యవస్థ పాడైపోయిందని, ఓడిపోయినా, 11 సీట్లు మిగిలినా నోళ్లు మూతపడట్లేదని మండిపడ్డారు. ఓట్టు, లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెబుతున్నా భవిష్యత్తులో వైసీపీ నేతల నోటి నుంచి ఇంకేమీ రాకుండా చేస్తానన్నారు. ఉద్యమమే కావాలంటే యుద్ధం చేస్తానని వైసీపీని హెచ్చరించారు. దేనికైనా సిద్ధమేనని, గొడవ కావాలంటే అభివృద్ధికి పాటుపడే గొడవ ఇస్తానని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తిట్టేస్తాం, పాత పద్ధతిలో కుటుంబ సభ్యులను తిడతామంటే చూస్తు ఊరుకునే ప్రసక్తే లేదని, తొక్కి పట్టి నారతీస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా ఈవీఎం, ఈవీఎం అంటున్న వైసీపీ వ్యాఖ్యలపై కూడా పవన్ స్పందించారు. ఈవీఎంలు మోసం చేస్తే ప్రధాని నరేంద్ర మోదీకి 270 రావాలి కదా? 151 సీట్లు వస్తే ఈవీఎంలు కరెక్ట్.. ఇప్పుడు 11 వస్తే మోసమా? మూడు నాలుగు నెలలకే పాటలు పాడుతున్నారేంటి? అని పవన్ మండిపడ్డారు. చూశారుగా.. పవన్ మాటలు నాటికి, నేటికి ఎలా మారిపోయాయో.. వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.

Pawan warning to YCP:

I am there.. Pawan Kalyan assured Sharmila
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs