Advertisement
Google Ads BL

ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన అమీ జాక్సన్


కోలీవుడ్ లో విక్రమ్ ఐ, రోబో 2 చిత్రాలతో, రామ్ చరణ్ ఎవడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లండన్ భామ అమీ జాక్సన్ ఆ తర్వాత వరస సినిమాలు మాత్రం చెయ్యలేకపోయింది. ఆమెకి అవకాశాలు రాకపోవడంతో నటనకు దూరంగా ఉంటున్న అమీ జాక్సన్ మొన్నామధ్యన జార్జి పయనెట్టు తో డేటింగ్ చేసి ఓ అబ్బాయికి జన్మనిచ్చింది.

Advertisement
CJ Advs

బాబు పుట్టాక జార్జ్ తో అమీ జాక్సన్ కి బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడింది. హాలీవుడ్ యాక్టర్ ఎడ్ వెస్ట్ నిక్ తో ప్రేమలో ఉన్న అమీ జాక్సన్ ఈ ఏడాది ఆగష్టు లో సన్నిహితులు, స్నేహితులు నడుమ అంగరంగ వైభవంగా ప్రియుడు ఎడ్ ను వివాహమాడింది.

పెళ్లయిన రెండు నెలలకే అమీ జాక్సన్ తన రెండో ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసి షాకిచ్చింది. భర్త ఎడ్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన రెండో ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసింది. 

Amy Jackson Announces Pregnancy:

To-be parents Amy Jackson-Ed Westwick dreamy love story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs