Advertisement
Google Ads BL

ఒక్కొక్కళ్ళకి సినిమా చూపిస్తానంటున్న లోకేష్


నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ ని మైంటైన్ చేసాడు. తండ్రి చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి ఎవరెవరు తమపై కక్ష సాధింపు చేసారో అనేది ఆ బుక్ లో రాస్తూ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లోని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్లపై తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ కార్యకర్తలు చాలా డిజప్పాయింట్ అయ్యారు.

Advertisement
CJ Advs

లోకేష్ మాత్రం చట్టప్రకారమే శిక్షలు అంటూ టీడీపీ వాళ్ళను కూల్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా రెడ్ బుక్ లోని మొదటి చాప్టర్, రెండో చాప్టర్ పూర్తయ్యాయి, మూడో చాప్టర్ తెరవాలంటే గన్నవరం ఎమ్యెల్యే యార్లగడ్డ, గుడివాడ ఎమ్యెల్యే రాము వెనిగండ్ల లు మరింతగా కష్టపడాలి అంటూ వంశీ వల్లభనేని, కొడాలి నాని కి ఇండైరెక్ట్ గా నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చాడు.

ప్రస్తుతం అమెరికాలో పెట్టుబడుల అన్వేషణలో బిజీగా ఉన్న నారా లోకేష్.. మధ్యలో టీడీపీ ఎన్నారై నేతలతో భేటీ అవుతున్నాడు. తాను గన్నవరం యువగళం సభలో హామీలిచ్చినవి అన్ని గుర్తున్నాయి, వాటిని నెరవేరుస్తాను, వైసీపీ ప్రభుత్వంలో తన యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. ఇందుకోసం త్వరలో రెడ్ బుక్ ఛాప్టర్ 3 ఓపెన్ చేస్తామని చెప్పిన లోకేష్ ఒక్కొక్కళ్ళకి సినిమా చూపిస్తా అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

Lokesh wants to show the movie to each of them:

  Lokesh says that there is no way to leave those who caused trouble
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs