రాజావారు రాణిగారు చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత చానళ్లకు SR కల్యాణమండపం హిట్ పడింది. ఆ తర్వాత కిరణ్ చేసిన మూవీస్ ఏవి ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. వరసగా నిరాశ పరిచే సినిమాలు వచ్చినా ఎక్కడా తగ్గని కిరణ్ అబ్బవరం ఒక ఏడాది తర్వాత ఒక సినిమాతో వస్తాను హిట్ కొడతానని ఛాలెంజ్ చేసాడు.
ఎలాంటి బ్యాక్ రౌండ్ లేకపోయినా హీరోగా ఎదిగాడు చాలా కష్టపడుతున్న కిరణ్ అబ్బవరం క చిత్రంతో దివాళి బరిలో నిలిచేందుకు రెడీ అయ్యాడు. అదే దీపావళికి నాగవంశీ లక్కీ భాస్కర్ ని దించేందుకు సిద్దమయ్యాడు. ఎన్నో రిలీజ్ డేట్ లను ప్రకటించి ఫైనల్ గా దీపావళిని చూజ్ చేసుకున్నారు. మరోపక్క శివ కార్తికేయన్ అమరన్ అంటూ భారీ ప్రమోషన్స్ తో వచ్చేసాడు. ముందు నుంచి లక్కీ భాస్కర్, అమరన్ లపై అంచనాలున్నాయి.
ఇటు కిరణ్ అబ్బవరం కూడా క ప్రమోషన్స్ విషయంలోనూ తగ్గలేదు, మరోపక్క బఘీర మూవీ పోటీ. ఈ దీపావళికి విడుదలైన నాలుగు సినిమాలు అన్ని వేటికవే ప్రత్యేకమైన చిత్రాలే. ఇలాంటి సమయంలో కిరణ్ అబ్బవరం క చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ క చిత్రానికన్నా లక్కీ భాస్కర్ కాస్త బావుండడం క చిత్ర కలెక్షన్స్ కి ఎంతోకొంత మైనస్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.
మొదటిరోజు క చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ ఏమైనా తగ్గితే మాత్రం కిరణ్ రాంగ్ టైమ్ ని చూజ్ చేసుకున్నట్టే అనిపిస్తుంది. మరో సమయంలో కిరణ్ అబ్బవరం క వచ్చినట్టైతే కలెక్షన్స్ పరంగా కొత్త మార్క్ సెట్ చేసేది.