Advertisement

సూపర్ స్టార్ వెట్టయ్యన్ ఓటీటీ డేట్ లాక్


సూపర్ స్టార్ రజినీకాంత్-జ్ఞానవేల్ కలయికలో తెరకెక్కి దసరా ఫెస్టివల్ సందర్భంగా అక్టోబర్ 10 న విడుదలైన వేట్టయ్యన్ మూవీ కి పలు భాషల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ లో పెద్దగా ప్రమోషన్స్ లేకుండా వచ్చిన వేట్టయ్యన్ ని తమిళ ప్రేక్షకులు ఆదరించినా తెలుగు ప్రేక్షకులు మాత్రం సూపర్ స్టార్ వేట్టయ్యన్ ను పెద్దగా పట్టించుకోలేదు. 

Advertisement

జైలర్ తర్వాత సోషల్ సబ్జెక్టు తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. అయితే ఇప్పుడు వేట్టయ్యన్ ఓటీటీ రిలీజ్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో చాలా ఆత్రుత నెలకొంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్నారు. 

తాజాగా వేట్టయ్యన్ ఓటీటీ డేట్ ని లాక్ చేసింది అమెజాన్ ప్రైమ్. రజినీకాంత్ వేట్టయ్యన్ చిత్రాన్ని నవంబర్ 8 నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి తెచ్చేలా మేకర్స్ ఏర్పాట్లు చేసేసారు. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల్లోనే వేట్టయ్యన్ ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

Vettaiyan OTT release locked:

Rajinikanth Vettaiyan OTT release date locked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement