బిగ్ బాస్ సీజన్8 లోకి కన్నడ సీరియల్ బ్యాచ్ అయిన నిఖిల్, పృథ్వీ, యష్మి ,ప్రేరణలు అడుగుపెట్టారు. వీరంతా ఫ్రెండ్షిప్ చేస్తూ కనిపించినా నిఖిల్, పృథ్వీ లు సోనియా వెంట పడడం అనేది యష్మి తట్టుకోలేకపోయింది. సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగానే యష్మి నిఖిల్ చుట్టూ తిరుగడం స్టార్ట్ చేసింది. ముందు నుంచి నిఖిల్ ఆమెను పట్టించుకోకపోవడం యష్మి తీసుకోలేకపోయింది.
సోనియా హౌస్ నుంచి వెళ్ళిపోయాక నిఖిల్ తోనే ఉంటున్న యష్మి కి నిఖిల్ కి మధ్యన ఈ వారం వాటర్ టాస్క్ లో పెద్ద యుద్ధమే జరిగింది. వాటర్ టాస్క్ లో నిఖిల్ రెడ్ టీం యష్మి, ప్రేరణలను టార్గెట్ చేసాడు. యష్మి ని పట్టుకోవడంతో ఆమె ఏడుపు స్టార్ట్ చేసింది. గౌతమ్ మీదున్న కోపంతో ఆ టీమ్ ని నిఖిల్ టార్గెట్ చెయ్యగా యష్మి హార్ట్ అయ్యింది.
నిఖిల్ ని నానా మాటలంది.. యష్మి ఏడుపు స్టార్ట్ చేసింది. నువ్వు టాస్క్ లో ఏడుస్తున్నావని తెలియగానే నిన్ను వదిలేసాను అప్పుడు ప్రేరణను టార్గెట్ చేశాను అన్నాడు. అయినా యష్మి వినలేదు. ఆ తర్వాత నిఖిల్ హార్ట్ అయ్యాడు, ఏడ్చాడు, యష్మి కలవాలని నచ్చజెప్పినా నిఖిల్ అవాయిడ్ చేసాడు. దానితో నిఖిల్ యష్మి తో ఫ్రెండ్ షిప్ బ్రేకప్ చేసుకున్నట్లుగా కనిపించాడు. యష్మి ఏం చెప్పినా వినలేదు. దానితో యష్మీ కి నిఖిల్ కి బ్రేకప్ అయినట్లే అని బుల్లితెర ప్రేక్షకులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.