Advertisement

దేవర ఓటీటీ డేట్ వచ్చేస్తుంది


యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనడం కాదు ఆర్.ఆర్.ఆర్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లో ఎదురులేదని నిరూపించారు. నెగెటివ్ టాక్ తోనే దేవర 500 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది అంటే కేవలం అది ఎన్టీఆర్ స్టామినానే అని ఒప్పుకుని తీరాల్సిందే. 

Advertisement

ఇక సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో విడుదలైన దేవర ఓటీటీ రైట్స్ ని సినిమా విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ భారీ డీల్ తో కొనేసింది. అయితే దేవర విడుదలైన ఎనిమిది వారాల గ్యాప్ తోనే ఓటీటీ స్ట్రీమింగ్ కి తెచ్చేలా మేకర్స్ ఒప్పందం చేసుకున్నప్పటికీ.. తాజాగా దేవర ఓటీటీ పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. 

అది దేవర ఓటీటీ విడుదలను ఆరు వారాల్లోగా అంటే నవంబర్ 8 నుంచి దేవర ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దమవుతుంది అంటున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన చేసేందుకు నెట్ ఫ్లిక్స్ రెడీ అయ్యింది అని టాక్. అంటే మరో వారం రోజుల్లో దేవర ని మళ్ళీ ఓటీటీలో వీక్షించేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. 

Devara to make OTT debut on this day:

Devara: Part 1 Set To Release On Netflix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement