Advertisement

దివాళి అప్ డేట్స్ పై ఆశపడొద్దు


ఏదైనా ఫెస్టివల్ వస్తుంది అంటే ఆయా హీరోల అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతారు. తమ అభిమాన హీరోల సినిమాల నుంచి కొత్త కొత్త పోస్టర్స్, టీజర్స్ అంటూ ఏదో ఒక అప్ డేట్ వస్తుంది అని ఎదురు చూస్తారు. అలాగే మేకర్స్ కుడా అభిమానుల కోసమే ప్రతి ఫెస్టివల్ కి తమ సినిమా ల నుంచి అప్ డేట్స్ సిద్ధం చేస్తారు. 

Advertisement

అయితే గత దసరా ఫెస్టివల్ సమయంలోమేకర్స్ చాలా లైట్ గా కనిపించారు. పెద్ద సినిమాల నుంచి ఎలాంటి సర్ ప్రైజ్ ట్రీట్స్ ఇవ్వలేదు. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ ఇలా ఏ హీరో సినిమా నుంచి బిగ్గెస్ట్ అప్ డేట్ రాలేదు. ఇప్పుడు దివాళి విషయంలో టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఇదె ఆలోచిస్తున్నారా లేదంటే సడన్ సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసారా అనేది అర్ధం కావడం లేదు. 

రేపు దీపావళి, మరి దివాళి ఫెసివల్ కి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి టీజర్ లాంటి బిగ్ అప్ డేట్ ఆశించారు మెగా ఫ్యాన్స్, కానీ గేమ్ ఛేంజర్ మేకర్స్ నుంచి ఎలాంటి అలికిడి కనిపించలేదు. మరోపక్క NBK 109 నుంచి టైటిల్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. నాగవంశీ ఈ విషయంలో నందమూరి అభిమానులకు సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదు అంటూ సారీ చెప్పేసాడు. 

ఇక రాజమౌళి-మహేష్ కాంబో అప్ డేట్ పై ఆశలు వదులుకున్నారు మహేష్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ వీరమల్లు నుంచి కూడా ఎలాంటి హడావిడి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇక చిరు విశ్వంభర కొత్త డేట్ ఏమైనా ఎనౌన్స్ చేస్తారేమో అనే ఆశలో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. తండేల్, రాబిన్ హుడ్ ఇలా మీడియం రేంజ్ హీరోలు ఎలాంటి అప్ డేట్స్ ఇస్తారో లేదంటే వాళ్ళు కూడా లైట్ అంటారో చూడాలి. 

Do not expect Diwali updates:

Diwali special movie updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement