Advertisement
Google Ads BL

మూడిట్లో రెండు హిట్ అయినా ఎదురుండదు


ఈ ఏడాది గుంటూరు కారంతో టాలీవుడ్ లో పాతుకుపోవాలి, మహేష్ లాంటి హీరో చిత్రంలో నటిస్తే ఆ క్రేజే వేరు అనుకున్న మీనాక్షి చౌదరికి గుంటూరు కారం ఇచ్చిన షాక్ అలాంటి ఇలాంటి షాక్ కాదు. హిట్: ది సెకెండ్ కేస్‌తో అందుకున్న డీసెంట్ హిట్ కూడా గుంటూరు కారం ఎఫెక్ట్ తో మరుగున పడిపోయినా మీనాక్షి చౌదరికి ఆఫర్స్ మాత్రం వరసగా తలుపు కొడుతూనే ఉన్నాయి.

Advertisement
CJ Advs

తెలుగులో అయితే బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోలు మీనాక్షి చౌదరికి అవకాశాలు ఇచ్చారు. వరసగా మూడు సినిమాలతో మీనాక్షి తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అందులో ముందుగా ఈ దీపావళి స్పెషల్ గా లక్కీ భాస్కర్ అంటూ వెంకీ అట్లూరి-దుల్కర్ సల్మాన్ చిత్రంతో అక్టోబర్ 31 న మీనాక్షి చౌదరి లక్కును పరీక్షించుకోబోతుంది.

ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు జోడీగా మట్కా చిత్రంతో నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే నెలలో వారం తిరక్కుండానే విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన మెకానిక్ రాకీ అనే సినిమాతో మరోసారి నవంబర్ 22వ టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతోంది.

మరి లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ ఈ మూడు చిత్రాలలో దుల్కర్, వరుణ్ తేజ్, విశ్వక్ సేన్ ఏ ఇద్దరు హీరోలు హిట్ ఇచ్చినా మీనాక్షి చౌదరి టైమ్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది. మరి మీనాక్షి లక్ ఎలా ఉందొ చూద్దాం. 

Offers keep knocking at Meenakshi door :

Meenakshi is going to come before the Telugu audience with three films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs