Advertisement
Google Ads BL

ఎవరూ తగ్గట్లే.. విజయమ్మపై వైసీపీ ప్రశ్నల వర్షం


వైఎస్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం రోజురోజుకు ముదురుతున్న పరిస్థితుల్లో.. అన్నా చెల్లెలు మధ్య అసలేం జరిగింది? వైఎస్ బతికి ఉన్నప్పటి నుంచి ఆస్తి పంపకాల వరకూ ఏం జరిగింది? ఎంవోయూ ప్రకారం ఏం జరగాలి? ఏమేం జరగలేదు? అనేది పూసగుచ్చినట్టు తల్లి వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. లేఖ మొత్తం మీద వైఎస్ షర్మిలకు సమాన ఆస్తి రావాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేసారు. కూతురికి అన్యాయం, నష్టం జరుగుతోందని.. ఆమెకే నా సంపూర్ణ మద్దతు అని తేల్చి తేలిపోయారు. అన్నీ తెలిసిన కొందరు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారు మీడియా ముందుకు వచ్చి ఆపద్ధాలు చెబుతున్నారని కూడా ఒకింత మండిపడ్డారు. సోషల్ మీడియాలో, మీడియాలో ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసేయడం, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడొద్దు అని చేతులు ఎత్తి నమస్కరిస్తూ లేఖ రాశారు. ఈ లేఖకు ప్రతి స్పందిస్తూ విజయమ్మపై వైసీపీ ప్రశ్నల వర్షం కురిపించింది. లేఖలో ఒక్కో విషయంపై ఒక్కో ప్రశ్న సంధిస్తూ మొత్తం 15 విషయాలను ప్రస్తావించింది పార్టీ.

Advertisement
CJ Advs

వైసీపీ ప్రశ్నలు ఇవే.. 

1. విజయమ్మ రాసిన లేఖలో జగన్‌ రెడ్డిని లీగల్‌గా ఇబ్బందిపెట్టేందుకు, తద్వారా బెయిల్‌ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్తావించకపోవడం ప్రజలను పక్కదోవపట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్‌మెంట్‌ ఉన్నప్పటికీ, తెలంగాణ హైకోర్టు స్టేటస్‌-కో ఆదేశాలు ఉన్నప్పటికీ, యాజమాన్యబదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని, అందుకే అటాచ్‌మెంట్లో ఉందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, సరస్వతీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జిల సహా న్యాయసలహాలు ఉన్నప్పటికీ, తప్పు అని తెలిసినప్పటికీ మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీచేసిన మాట వాస్తమే కదా? షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై జగన్‌కు న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి, తెలిసి కూడా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజమేకదా? విజయమ్మ లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైయస్సార్‌గారి అభిమానులను పక్కదోవపట్టించడమే కదా?

2. 2024 ఎన్నికల్లో జగన్‌ ఒక్కడే ఒకవైపు ఉంటే, అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టుకడితే, మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా, దివంగత మహానేత వైయస్సార్‌ పేరు ఎఫ్ఐఆర్‌లో పెట్టిన, తన కుమారుడిని అన్యాయంగా 16నెలలు జైల్లోపెట్టిన కాంగ్రెస్‌కు ఓటు వేయండంటూ, వైసీపీని ఇబ్బందిపడుతూ వీడియో విడుదలచేసి విజయమ్మ.. షర్మిల వైపు ఉన్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. దివంగత వైయస్సార్‌ రాజకీయ ప్రత్యర్థులకు, వైయస్సార్‌ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా? రాజకీయాలు పక్కనపెడితే ఒక తల్లిగా ఆరోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు, కనీసం తటస్థవైఖరిని మరిచిపోయి, పక్షపాతం వహించిన వైనంచూసి వైయస్సార్‌ అభిమానులు తీవ్రంగా కలతచెందారు, బాధపడ్డారు. 

3. ఇప్పుడు షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో, సరస్వతీ కంపెనీ వ్యవహారంలో న్యాయపరంగా ఇబ్బందులు వచ్చి, స్వయంగా ఆమె కుమారుడి బెయిల్‌ రద్దు కుట్రకు దారితీస్తుందని తెలిసికూడా మోసపూరితంగా, షేర్ల సర్టిఫికెట్లు పోయాయని చెప్పి, ఒరిజనల్‌ షేర్‌ సర్టిఫికెట్‌ లేకుండా, జగన్‌ సంతకాలు లేకుండా, ఎవ్వరికీ తెలియకుండా షేర్లను బదిలీచేసి, షర్మిలగారితోనే విజయమ్మ ఉన్నారని మరోసారి స్పష్టంగా చెప్పారు. 

4. అంతేకాకుండా జగన్‌, షర్మిల వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం టీడీపీ సోషల్‌ మీడియా అక్కౌంట్‌లో ప్రత్యక్షం కావడం, విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ ఉత్తరాన్ని టీడీపీ విడుదలచేయడం, పలు సందర్భాల్లో జగన్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసినా, జగన్‌ ఏనాడూ తన చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడకపోయినా విజయమ్మ ఏరోజూ సరిదిద్దే కార్యక్రమం చేయకపోవడం, ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. 

5. కోర్టుల్లో ఉన్న కేసులను ప్రతికూల రీతిలో ప్రభావితం చేసేలా షర్మలగారి ప్రవర్తన, చర్యలు ఉన్నా, ఒకవైపు ఆస్తులపై హక్కులు కోరుతూ, మరోవైపు అందుకు విరుద్ధంగా ఆమె వ్యవహరించినా, తప్పుడు కేసులపై జగన్‌ చేస్తున్న పోరాటం, వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆమెకు ఎలాంటి ఆందోళన లేనట్లు ప్రవర్తించినా, జగన్‌ రెడ్డిని రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు, బలహీనుడిని చేసేందుకు అనుగుణంగా ఆమె నడుచుకున్నా, షర్మిల వేసిన ప్రతి అడుగు కూడా ప్రత్యర్థులకు లబ్ది చేకూర్చేలానే ఉన్నా, మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా ఓపికతో, సహనంతో, మౌనంగా ఆ బాధను జగన్‌ అనుభవించారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు? ఒక తల్లిగా శ్రీమతి విజయమ్మ బాసట ఎవరికి ఉండాలి? అన్న బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. 

6. రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టిన దగ్గరనుంచి అవకాశం ఉన్నప్పుడల్లా జగన్‌ను షర్మిల ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి ఒక్కసారిగా మాయమై, రాజశేఖరరెడ్డి ఎఫ్ఐఆర్‌లో పెట్టిన పార్టీకి, అన్నను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించిన పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షురాలిగా వచ్చారు. పోనీ రాజకీయాలు ఇంతే అనుకున్నా, ప్రజాస్వామ్య విమర్శల పరిధిని దాటి, ఆజన్మాంత శత్రువు మాదిరిగా అన్నను షర్మిల అనరాని మాటలు అన్నారు. ఎన్నికల సమయంలో జగన్‌పై దాడి జరిగితే ఎగతాళి చేసి, అమానవీయంగా మాట్లాడింది షర్మిల కాదా? వీటన్నింటినీ జగన్‌ ఓపికతో భరించారు. మరి రచ్చకెక్కింది ఎవరు? పరువుతీసింది ఎవరు? నిజమైన బాధితులు ఎవరు? జగన్‌ బాధితుడు కాదంటారా? 

7. కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లు కారణంగా విజయమ్మ న్యాయ అన్యాయాల విచక్షణను విస్మరించారు. కుమార్తెను వెనకేసుకువచ్చే ధోరణివల్ల, సరస్వతీ కంపెనీల విషయంలో తనవంతు పాత్ర పోషిస్తూ చట్టవ్యతిరేక పనులకు తోడ్పడ్డారు. తన కుమారుడు ఎదుర్కోబోయే చట్టపరమైన సంక్షిష్ట పరిస్థితులేంటో తెలిసి కూడా విజయమ్మ దాన్ని విస్మరించారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం ఇదే. 

8. వైయస్సార్‌ జీవించి ఉన్నపుడే జగన్‌ కంపెనీలు నడిపారు, అలాగే షర్మిల తన కంపెనీలను తాను నడిపారు. ఉమ్మడి ఆస్తులు అయితే మరి ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు? వైయస్సార్‌ మనోభావాలు, ఆజ్ఞ వేరేలా ఉంటే ఇలా ఎందుకు జరిగి ఉంటుంది? తనకుమార్తెకు వైయస్సార్‌ తన పూర్వీకుల ఆస్తులతో పాటు, తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చాడు. జగన్‌ ఆస్తులు తనవికాదు కాబట్టి, ఇవ్వలేదు. ఎందుకంటే ఈ జగన్‌ స్వార్జితం కాబట్టి. 

9. వైయస్సార్‌ బ్రతికి ఉండగానే షర్మిల పెళ్లై 10 ఏళ్లు, వైయస్సార్‌ మరణించి మరో 1౦ ఏళ్లు గడిచిన తర్వాత, అంటే 20 ఏళ్లు తర్వాత జగన్‌ తన స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలిపై ప్రేమానురాగాలకొద్దీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. కోర్టుకేసుల నేపథ్యంలో 2019లో ఆమెకు మంచి చేస్తూ ఒక ఎంఓయూ రాసి ఇచ్చారు. అంతేకాకుండా గడచిన పదేళ్లకాలంలో దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు వివిధకాలాల్లో షర్మిల జగన్‌ ద్వారా పొందినా తన సోదరుడిపట్ల ఆమె ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు. 

10. తన స్వార్జితంతో సంపాదించిన ఆస్తులను, లవ్‌ అండ్‌ అఫెక్షన్‌తో షర్మిలకు ఇస్తున్నాని జగన్‌ ఎంఓయూ రాస్తే,. దానిపై విజయమ్మ, షర్మిల ఇద్దరూ సంతకాలు చేశారు. అంటే దీని అర్థం జగన్‌ స్వార్జిత ఆస్తుల్లో హక్కులేదని ఆరోజు వారు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా? మరి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించనట్టే. నిజంగా ఉమ్మడి ఆస్తులు అయితే, వాటిని పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదని, చట్టరీత్యా హక్కుగా వస్తుందని ప్రతికుటుంబానికి తెలుసు. 

11. ఇంత యాగీ చేస్తున్న షర్మిల ఈ సంస్థల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? ఒక్కరోజైనా కంపెనీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారా? కంపెనీలకున్న రూ.1400 కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచీకత్తు ఇస్తూ సంతకం పెట్టారా? లేక రూ.500 కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర ఆమె పోషించారా? ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో, చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఏరోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా? 

12. పైగా ఈ కంపెనీల మీద, జగన్‌ మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా వారిని బలపరుస్తూ, కంపెనీలను బలహీనపరుస్తూ సాగుతున్న నడవడిక, వైఖరి చూస్తే ఈ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా వాటాలు ఉంటే, ఇలా చేస్తారా? ఇలా జగన్‌, ఆయన కంపెనీలను ఇబ్బందులపాలు చేస్తారా?

13. ఇప్పుడు వైయస్సార్‌ కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజలముందు ఉన్నాయి. ఒకటే వాదనను వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు స్థాయిగల వ్యక్తులు, వివిధ సందర్భాల్లో, వివిధ పద్ధతుల్లో వినిపించడం వల్ల పదేపదే బురదజల్లడం అవుతుంది తప్ప, దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇప్పుడు ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి.

14. జగన్‌ స్వార్జితమైన ఆస్తిలో, ఎలాంటి హక్కులేకపోయినా, ఆ ఆస్తిలో భాగం కావాలని షర్మిల ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి? ఇంత యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? అందులోని లేఖను టీడీపీ విడుదల చేయడమేంటి? ఆమె పద్ధతి, ప్రవర్తన మారి, ఆమె తన ప్రేమానురాగాలు చూరగొంటే, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆమెకు ఏమేరకు మంచి చేయాలో, ఎంత చేయాలో, ఏమి చేయాలో ఆరోజు నిర్ణయం తీసుకుంటానని జగన్‌ ఇదివరకే స్పష్టంచేశారు. 

15. ఈ నేపథ్యంలో వైయస్‌ఆర్‌ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టంచేసిందని వైసీపీ 8 పేజీల లేఖను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది.

మాటల తూటాలు..!

ఇప్పుడు వైయస్సార్‌ కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజలముందు ఉన్నాయి. ఒకటే వాదనను వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు స్థాయిగల వ్యక్తులు, వివిధ సందర్భాల్లో, వివిధ పద్ధతుల్లో వినిపించడం వల్ల పదేపదే బురదజల్లడం అవుతుంది తప్ప, దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇప్పుడు ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి. ఈ నేపథ్యంలో వైయస్‌ఆర్‌ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తామని ఇదివరకే పార్టీ స్పష్టం చేసిందని వైసీపీ కార్యకర్తలు, నేతలు చెబుతున్నారు. ఇందుకు కౌంటర్లు కూడా ప్రత్యర్థులు, విమర్శకులు నుంచి గట్టిగానే వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ అంటే ఎవరు రాసినట్టు? జగన్ రెడ్డి రాశారా..? సజ్జలా? సజ్జల భార్గవ్? లేదా ఇవన్నీ కాకుండా ఈ అకౌంట్ అడ్మిన్? రాశారా అనే ప్రశ్నలు గట్ట గానే వస్తున్నాయ్. ఎందుకంటే ఊరు.. పేరు లేకుండా ఉంది.

YCP rains questions on Vijayamma:

Y.S. Vijayamma breaks silence
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs