Advertisement
Google Ads BL

బాలయ్య వేరే లెవల్ అంతే..


నందమూరి నటసింహ బాలకృష్ణ ఆహా టాక్ షో అన్ స్టాపబుల్ అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేస్తున్నారు. మొట్టమొదటిసారిగా టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్య అన్ స్టాపబుల్ లో అప్పుడే మూడు సీజన్స్ పూర్తి చేసి నాలుగో సీజన్ స్టార్ట్ చేసేసారు. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ లో సీఎం చంద్రబాబు ను ఆటాడించిన బాలయ్య సెకండ్ ఎపిసోడ్ కి సరదా సరదాగా మారిపోయారు. 

Advertisement
CJ Advs

ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 సెకండ్ ఎపిసోడ్ కి లక్కీ భాస్కర్ టీం దుల్కర్ సల్మాన్, మీనాక్షి, వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ వచ్చారు. మరి బాలయ్య దుల్కర్ సల్మాన్ ని ఆడుకున్న తీరుకు మాత్రం మలయాళం నుంచి బాలయ్య కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఏర్పడడం ఖాయం. ఇక వెంకీ అట్లూరి, నాగ వంశీని అయితే బాలయ్య ఆటపట్టించిన తీరుకు రెండు తెలుగు ప్రేక్షకులు ఇంప్రెస్స్ అవుతున్నారు. 

నాగవంశీని.. ఏంటి ఎవరైనా డ్రెస్సింగ్ స్టయిల్ నచ్చకపోతే చెప్పాలని ఉందా అనగానే దిల్ రాజు గారు ఓ పింక్ ప్యాంట్  వేసుకుంటారు, ఇంకోసారి అది వేసుకోవద్దని చెబుదామనుకున్నా అనగానే బాలయ్య నీకు ఏ హీరో పారితోషికం చూసి అమ్మో అనిపించింది అంటే.. అదా చెప్పలేను సర్.. మీలాగా నేను బాలయ్యను కాదు కదా అన్నాడు. ఇక వెంకీ అట్లూరి ని ఏ హీరోయిన్ అంటే ఇష్టమనగానే పూజ హెగ్డే తో చేయాలనుకుంటున్నాడు అంటూ నాగ వంశి ఆన్సర్ ఇచ్చాడు. 

నీ హైట్ ఏమిటి పూజ హెగ్డే ఏమిటి అని బాలయ్య అనగానే వెంకీ అట్లూరి సరిపోతాను సర్ అంటాడు. అటు దుల్కర్, ఇటు నాగవంశీ, ఆఖరికి మీనాక్షిని కూడా బాలయ్య ఆటపట్టించిన తీరుకు జై బాలయ్య అంటూ అక్కడి ఆడియన్స్ కేకలు వేశారు. నిజంగా ఈ ఎపిసోడ్ మొత్తం చూసి వేరే లెవల్ అంటారేమో. 

Balayya is a different level..:

NBK Unstoppable 4 second episode promo viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs