ఇప్పటివరకు హీరోయిన్ గానే అందరికి తెలిసిన శోభిత దూళిపాళ్ల ఇప్పుడు అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెట్టబోతుంది. దానితో ఆమె మరింత స్పెషల్ గా మారిపోయింది. అక్కినేని నాగార్జున కోడలిగా నాగ చైతన్య భార్యగా అతి త్వరలోనే అక్కినేని ఇంట అడుగుపెట్టబోతున్న శోభిత దూళిపాళ్ల గత రాత్రి ANR అవార్డు వేడుకలో స్పెషల్ గా మెరిసింది.
నాగ చైతన్య తో కలిసి ఆ వేడుకలో కలియదిరిగింది. నాగార్జున ప్రత్యేకంగా కోడలిగా తన ఇంట అడుగుపెట్టబోతున్న శోభితకు అంతకు ముందే కోడలి హోదా ఇచ్చేసి మెగాస్టార్ చిరుకు, అలాగే మరికొంతమంది అతిధులకు స్పెషల్ గా పరిచయం చేసిన వీడియోస్ ఇప్పుడు అక్కినేని అభిమానులను సర్ ప్రైజ్ చేసాయి.
అక్కడ అమితాబ్, చిరు, వెంకీ, ఇంకా ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నా అక్కడ అందరి కళ్ళు చైతు-శోభితల జంటపైనే ఉంది. ఆ ఫొటోస్ ఎక్కువగా వైరల్ అయ్యాయి. నిజంగా ఈ మూమెంట్ శోభితకు చాలా స్పెషల్. అక్కినేని ఇంట అడుగుపెట్టకముందే ఆమెకు ఇంతటి ఆనందమైన క్షణాలు దక్కడం స్పెషల్ కాక మరేమిటి.