రాజావారు - రాణిగారు చిత్రంతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత Sr కల్యాణమండపం లాంటి యావరేజ్ హిట్ చూసాడు. రాజావారు-రాణిగారు చిత్రాల మధ్యలో, వీటి తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన ప్రతి సినిమా ఆయన అభిమానులను నిరాశపరిచింది. వరస వైఫల్యాల తర్వాత తన మొదటి హీరోయిన్ తో లవ్ లో పడిన కిరణ్ అబ్బవరం రహస్యను ఈ ఆగస్టు లో ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన అంగరంగ వైభవముగా వివాహం చేసుకున్నాడు.
ఇప్పుడు అతని లేటెస్ట్ చిత్రం క విడుదలకు సిద్ధమైంది. క ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాదు టైటిల్ దగ్గర్నుంచి, ట్రైలర్ వరకూ ఏదో ఒక రూపంలో క ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తూ వస్తుంది. ఈ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో క ని కిరణ్ అబ్బవరం ప్రమోట్ చేస్తున్నాడు. రేపటి నుంచే క స్పెషల్ ప్రీమియర్స్ కి రెడీ అయ్యింది.
తాజాగా క లో చివరి 20 నిముషాలు అదిరిపోయే ట్విస్ట్ లతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది అంటూ ఓ వార్త వైరల్ అయ్యింది. మరోపక్క క క్లైమాక్స్ పై కిరణ్ అబ్బవరం చేసిన ఛాలెంజ్ తెలిసిందే. సో క తో కిరణ్ అబ్బవరం ఈసారి సూపర్ హిట్ కొట్టడం పక్కా అంటూ ట్రేడ్ నుంచి వినిపిస్తోన్న న్యూస్.
ఈ దివాళి కి కిరణ్ అబ్బవరం క తో మిగతా సినిమాలకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ గట్టి పోటీ ఇవ్వడం పక్కా అని ఆయన అభిమానులు కూడా డిసైడ్ అవుతున్నారు.