Advertisement
Google Ads BL

టీడీపీ నేతలు, కార్యకర్తలు జర జాగ్రత్త


అధికారం చేతిలో ఉంది మనల్ని ఎవడేం పీకుతాడు అని నోటికొచ్చినట్లుగా మాట్లాడితే.. అధికారం పోయాక పొగరు అణగక తప్పదు అనేది వాస్తవం. వైసీపీ ప్రభుత్వంలో అహంకారంతో ఊగిపోయిన కొడాలి నాని, జోగి రమేష్, సిదిరి, అంబటి, రోజా, వల్లభనేని లాంటి వాళ్ళు ఇప్పుడు అధికారం పోగానే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో కోర్టు కి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం నానా తంటాలు పడుతున్నారు. 

Advertisement
CJ Advs

మరోపక్క నరికేస్తా, చంపేస్తా అంటూ వైసీపీ నేతల డైరెక్షన్ లో నడిచిన బోరుగడ్డ అనిల్ ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. అధికారం మనదే, కాదు ఎప్పటికి మనదే అని విర్రవీగిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు ఇళ్లకే పరిమితమై..  జైలుకి వెళ్ళవలసిన పరిస్థితిలో ఉన్నారు. అధికారం శాశ్వతం కాదు అనేది ఇప్పుడు, ఎప్పుడు ఎవ్వరైనా గుర్తించాలి. 

అదే టీడీపీ నేతలకు, కార్యకర్తలకు, జనసేన నేతలకు అందరూ ఇస్తున్న సలహా. అధికారం మనదే అని విర్రవీగకూడదు, ఆ అధికారం శాశ్వతం కాదు, మళ్ళీ వాళ్ళ టైమ్ స్టార్ట్ అవుతుంది. వైసీపీ నేతలను అనేముందు టీడీపీ వాళ్ళు అది గుర్తుపెట్టుకుంటే చాలు.. జర జాగ్రత్త అంటూ నెటిజెన్స్ టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఒళ్ళు దగ్గరపెట్టుకోమని సలహాలు పారేస్తున్నారు. 

TDP leaders and fans beware:

TDP vs YSRCp
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs