బిగ్ బాస్ సీజన్ 8 లో ఎనిమిది వారాల ఆట పూర్తయ్యి కంటెస్టెంట్స్ తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టారు. గత వారం నాగమణికంఠ ఎలిమినేట్ అవ్వగా ఈ వారం దివాళి ఫెస్టివల్ ఎపిసోడ్ లో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ మొదలు కాకముందే ముక్కు అవినాష్ ని డాక్టర్స్ పరీక్షించి కడుపు నొప్పి మీరు హౌస్ నుంచి బయటికి రావాని చెబితే అవినాష్ హౌస్ మేట్స్ కి చెప్పి ఈరోజు బయటికి వెళ్ళిపోయిన ప్రోమో చూపించారు.
నిజంగానే భార్య మీద, నయని మీద ఒట్టేసి అవినాష్ ఎలిమినేట్ అయ్యాడా లేదంటే ఇది ఫ్రాంకా అనేది అర్ధమవక చాలామంది ప్రేక్షకులు తికమకపడుతున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలవడమే కాదు. విష్ణు ప్రియను బిగ్ బాస్ ఐదుగురిని నామినేట్ చెయ్యమనగానే గౌతమ్ ని, ఇంకా టేస్టీ తేజ, యష్మి ఇలా ఐదుగురిని నామినేట్ చేసింది.
9వ వారానికి గాను నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. 9వ వారం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారిలో ఎక్కువగా గౌతమ్ కృష్ణ ను నామినేట్ చేసారు, తర్వాత యష్మి ని టార్గెట్ చేసారు హౌస్ మేట్స్, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ లు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.