బిగ్ బాస్ సీజన్ 8 దివాళి ఈవెంట్ లో నయని పావని vs మెహబూబ్ అన్నట్టుగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో నయని పావని ఎలిమినేట్ అయ్యింది అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడాడు. మెహబూబ్ కమ్యూనిటీ ఓట్ల టాపిక్ ఎత్తడమే అతని ఇమేజ్ ని డ్యామేజ్ చేసి హౌస్ నుంచి బయటికి వెళ్లేలా చేసింది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.
ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలు కాకముందే జబర్దస్త్ కమెడియన్ అవినాష్ తాను హెల్త్ రీజన్స్ తో హౌస్ నుంచి వెళ్ళిపోయినట్లుగా బిల్డప్ ఇచ్చిన ప్రోమో వదిలారు. ఆదివారం ఎపిసోడ్ ముగించగానే నామినేషన్లకు సంబంధించిన ప్రోమో వేస్తారు కానీ అవినాష్ హౌస్ ను వీడినట్లుగా ప్రోమో వదిలారు.
ఆ ప్రోమోలో అవినాష్ తనకు భరించలేని కడుపునొప్పి ఉందని, తాను బిగ్ బాస్ హౌస్ లో చాలా ఇబ్బంది పడుతున్నాను ఆ కారణంతో తాను బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతున్నాను అంటూ అందరికీ షాక్ ఇస్తాడు. ఈ క్రమంలో నిజంగా వెళ్తున్నావా అంటే.. ప్రామిస్ గా తాను వెళ్తున్నానంటూ నయని పై ఒట్టు కూడా పెట్టడంతో హౌస్ మేట్స్ అంతా కన్నీళ్లు పెట్టుకునేలోపు బిగ్ బాస్ ఎగ్జిట్ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. దీంతో అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి అవినాష్ వెళ్ళిపోయిన ప్రొమో వదిలారు.
మరి నిజంగానే అవినాష్ హౌస్ నుంచి వెళ్లిపోయాడా, లేదంటే ఇదేమన్నా సీక్రెట్ టాస్కా, కాదు ఫ్రాంకా అనేది తెలియాల్సి ఉంది.