Advertisement
Google Ads BL

రాజా సాబ్ సెట్స్ నుంచి ఫౌజీ సెట్స్ లోకి ప్రభాస్


కల్కి పార్ట్ 1 సక్సెస్ తరవాత కొద్దిరోజుల పాటు ఇటలీలో ఎంజయ్ చేసి వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆ తర్వాత విరామమే తీసుకోకుండా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ షూటింగ్ ముగించేస్తున్నారు. ఈ మధ్యలో దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్ తో ఫౌజీ(వర్కింగ్ టైటిల్) మూవీ ని మొదలు పెట్టి సెట్స్ మీదకి వెళ్లిపోయారు. 

Advertisement
CJ Advs

మొదటి షెడ్యూల్ ని ప్రభాస్ లేకుండానే మధురై లో ముగించేసిన హను రాఘవపూడి సెట్స్ లోకి ఇప్పుడు ప్రభాస్ ఎంటర్ అయ్యారు. రాజా సాబ్ కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసిన ప్రభాస్ హైదరాబాద్ లో వేసిన ఫౌజీ మూవీ స్పెషల్ సెట్ లో రెండో షెడ్యూల్ షూటింగ్ పాల్గొంటున్నారు. నిన్నటి నుంచే ఫౌజీ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలయ్యింది. 

మరి రాజా సాబ్ ని త్వరగా కంప్లీట్ చేస్తే ఆ తర్వాత ఫౌజీ మూవీ తో పాటుగా సందీప్ వంగ తో కలిసి స్పిరిట్ పూర్తి చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారు. అయితే స్పిరిట్ లో ఇప్పటివరకు ఎన్నడూ చూడనటువంటి లుక్ లో ప్రభాస్ కేరెక్టర్ ను సందీప్ వంగా డిజైన్ చెయ్యడంతో.. ప్రభాస్ పూర్తి సమయాన్ని స్పిరిట్ కు కేటాయించినప్పుడే స్పిరిట్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లే ఆలోచనలో సందీప్ వంగ ఉన్నట్లుగా టాక్ ఉంది. 

Prabhas from Raja Saab sets to Fauji sets:

Prabhas joins the shoot of Fauji
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs