టాలీవుడ్ లో గుంటూరు కారం వేసిన బ్రేకులు మళ్ళీ రిపేర్ చేసుకుని రవితేజ, నితిన్ లతో క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్న శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై విపరీతమైన చర్చ నడుస్తుంది. డైరెక్టర్ రమేష్ తురానీ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న మూవీ హే జవానీతో ఇష్క్ హోనా హై లో శ్రీలీలకు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది అనే ప్రచారం జరిగింది.
మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో ఫస్ట్ హీరోయిన్, శ్రీలీల సెకండ్ హీరోయిన్ అంటూ ప్రచారం జరగగా.. ఇప్పటికే శ్రీలీల ఆ సినిమా షూటింగ్ లోకి ఎంటర్ అయ్యింది అని కూడా అన్నారు. తాజా సమాచారం ప్రకారం శ్రీలీల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. ఆ ప్లేస్ లోకి బుట్టబొమ్మ పూజ హెగ్డే వచ్చి చేరింది అనే టాక్ బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
శ్రీలీల ప్రస్తుతం ఇతర సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న కారణముగా హే జవానీతో ఇష్క్ హోనా హై సినిమా షూటింగ్ సంబంధించిన కాల్ షిట్స్ ను కేటాయించలేకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. హే జవానీతో ఇష్క్ హోనా హై షూటింగ్ అనుకున్న సమయాని కన్నా కాస్త ఆలస్యంగా మొదలు కావడంతో శ్రీలీల ఈ ప్రాజెక్ట్ ను వదులుకోవాల్సి వచ్చింది అంటున్నారు.