సౌత్ లో తెలుగు, తమిళ చిత్రాలతో నిమిషం ఖాళీ లేకుండా సినిమాలు చేసినా ఆమె ఖాతాలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు, అంతేకాదు గ్లామర్ విషయంలో వెనకడుగు వెయ్యకుండా అందాలు చూపించినా స్టార్ అవకాశాలు ఆమె తలుపు తట్టలేదు. జై లవ కుశ లో రాశి ఖన్నా కు ఎన్టీఆర్ అవకాశం ఇచ్చినా ఆ తర్వాత ఆమెను మరో స్టార్ హీరో పట్టించుకోలేదు.
ఆ తర్వాత హిందీలో అడుగుపెట్టి వెబ్ సీరీస్ తో తనని తాను నిరూపించుకున్న రాశి ఖన్నా తర్వాత చేస్తున్న హిందీ ప్రాజెక్ట్స్ ఏవి ఆమెకు హిట్ ఇవ్వలేదు. వరసగా నిరాశ పరిచే ప్రాజెక్ట్స్ తగులుతున్నాయి. తాజాగా రాశి ఖన్నా నటించిన సబర్మతి రిపోర్ట్ చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది. సబర్మతి రిపోర్ట్ ప్రమోషన్స్ లో రాశి ఖన్నా పెళ్లిపై, పిల్లలపై హాట్ కామెంట్స్ చేసింది.
పెళ్లి అనేది నా పర్సనల్ విషయం కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే ఉంది. కానీ దానికి ఇంకా టైమ్ ఉంది. అది నా పర్సనల్ విషయం. దానిని నా వృత్తితో కలపాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే నేను మీకు చెప్పే చేసుకుంటాను.
కానీ పెళ్లి విషయంలో రూమర్స్ క్రియేట్ చేయకండని రాశి ఖన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.