నాగచైతన్య-సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ళ పెళ్లి బంధాన్ని వారు విడాకుల తో విడగొట్టేసుకున్నారు. అప్పటినుంచి సమంత మానసికంగాను, అటు మాయోసైటిస్ వ్యాధి తోనూ సతమతమవుతూ కెరీర్ లో ముందుకు వెళుతుంది. ఇక నాగ చైతన్య మాత్రం లైఫ్ లో మూవీ ఆన్ అవుతూ రెండో పెళ్ళికి సిద్దమయ్యాడు. హీరోయిన్ శోభిత దూళిపాళ్ళలో వివాహానికి రెడీ అయ్యాడు.
చైతూతో విడాకులయ్యాక సమంత ఒంటరిగానే జీవిస్తుంది. ఇప్పుడు సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సీరీస్ నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కు రాబోతుంది. ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా వున్న సమంత ను రెండో పెళ్లి చేసుకుంటారా అని అడగగా.. దానికి సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది.
నేను గతంలో ప్రేమించి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ కలిసి లేము, ఇప్పుడు విడిపోయాం. అందుకే ఇక లైఫ్ లో రెండో పెళ్లి గురించి ఆలోచన లేదు. అసలు నాకు మరో వ్యక్తి అవసరం లేదు. ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నా అంటూ సమంత రెండో పెళ్లి విషయమై తెగ్గొట్టేసింది.