బిగ్ బాస్ సీజన్ 8 లో ఎనిమిది వారాలు పూర్తయ్యి తొమ్మిదో వారం మొదలైపోయింది. ఎనిమిది వారాల్లో ఇప్పటివరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వకపోయినా.. సీజన్ 8 మొదలైనప్పటి 14 మంది కంటెస్టెంట్స్ లో ఎనిమిదిమంది ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో ఆడియన్స్ లో సస్పెన్స్ మొదలైంది.
ఓజీ క్లాన్, రాయల్ క్లాన్ సభ్యుల మధ్య నామినేషన్ల ప్రక్రియలో మినీ యుద్ధమే నడిచింది. ఈ వారం నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, నయని పావని, మెహబూబ్, విష్ణుప్రియ లు నామినేషన్స్ లో ఉండగా.. అందులో నిఖిల్, ప్రేరణ ఓటింగ్ లో పోటీపడ్డారు. చివరి స్థానంలో అంటే డేంజర్ జోన్ లో మెహబూబ్-నయని నిలిచారు.. చాలా తక్కువ ఓటింగ్ మార్జిన్ తో నయని పావని ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది.
మరోపక్క ఈ వారం నయని పావని ఎలిమినేట్ అయ్యింది అనే వార్తలొచ్చినా చివరిగా మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. కొంతమంది మెహబూబ్ అంటుంటే, మరికొంతమంది నయని పావని ఎలిమినేట్ అంటున్నారు. వీరిరువురిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనేది ఆదివారం ఎపిసోడ్ లో క్లారిటీ వస్తుంది.