బిగ్ బాస్ మొదలయ్యాక మూడు, నాలుగు సీజన్స్ ను బుల్లితెర ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేసారు. ఆ తర్వాత సీజన్స్ ను ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదు, కేవలం నాగార్జున వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రమే చూస్తున్నారు. బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిపోడ్, అలాగే వీకెండ్ ఎపిసోడ్స్, ఇంకా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ ని చూస్తున్నారు.
ఇక సీజన్ 8 లో ఈ శనివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ కు ఫుల్ క్లాస్ ఇవ్వడం కాదు కొంతమంది కంటెస్టెంట్స్ పై ఫైర్ అయ్యారు. పృథ్వీ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ పై పృథ్వీ ని నాగ్ టార్గెట్ చేసారు. ఇక నిఖిల్ సంచాలక్ గా ఫెయిల్ అయ్యాడా అంటూ టేస్టీ తేజ నీ కుట్ర నువ్వు పన్నావన్నమాట అంటూ నాగ్ ఏసుకున్నారు.
యష్మి నువ్వు విష్ణు ప్రియను ఎందుకు నామినేట్ చేసావ్ అంటే.. ఆమె ఇండివిడ్యువల్ గేమ్ కనిపించలేదు అంది.. మరి నీ గేమ్ ఏమిటో చెప్పు అంటూ యష్మి ని నాగ్ అడిగారు, నబీల్ నువ్వు 50 వేలు పోతాయని తెలిసి కూడా హరితేజ ను నామినేట్ చేసావ్ అన్నారు. హరితేజ నువ్వు నయని ఏ క్లాన్ లో ఉన్నారు, ఏమయ్యా గౌతమ్ కోపంలో ఒకమాట, షార్ట్ టెంపర్ లో ఓ మాట, వీకెండ్ లో ఓ మాట అంటూ నాగార్జున గౌతమ్ ని కూడా మాములుగా క్లాస్ పీకలేదు. మరి పూర్తి ఎపిసోడ్ కోసం ఇంకాస్త వెయిట్ చేస్తే సరి.