ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ని షర్మిల అనే చెల్లి పట్టి పీడిస్తుంది, కాదు కాదు చెల్లిని మోసం చేసాడని అన్నను జైలుకు పంపించే ఏర్పాట్లను షర్మిల చేస్తుంటే ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు షర్మిల వెనుకుండి నడిపిస్తున్నాడంటూ తన నేతలను రెచ్చగొట్టి మీడియా ముందుకు పంపుతున్నాడు జగన్.
చెల్లి తనను తికమక పెట్టి ఆస్తి కోసం నానా ఇక్కట్లు పెడుతుంటే అయ్యో ఈ ఐడియా షర్మిల ది కాదు చంద్రబాబు ది అంటూ జగన్ మాత్రమే కాదు, మిగతా వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరమే. జగన్ ఆస్తి ఇస్తే షర్మిల కు వస్తుంది కానీ, చంద్రబాబు కి ఏం ఒరుగుతుందో మరి. జగన్ vs షర్మిల మధ్యలో బాబు ఇది వైసీపీ వాదన.
ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ మీడియా కంటపడకుండా సోషల్ మీడియాకే పరిమితమైన అంబటి రాంబాబు..
నాడు ………….
జగనన్న వదిలిన బాణం!
నేడు.............
చంద్రన్న వదిలిన బాణం!
విధి...........విచిత్రమైనది! అంటూ ట్వీట్ వేసాడు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల వైసీపీ ని నడిపించింది.
ఇక వైసీపీ ఎమ్యెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే షర్మిల పనిచేస్తున్నారు.
అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారు.
షేర్లు బదిలీతో జగన్ కు ఇబ్బందులు వస్తాయని తెలిసి చేశారు.. అంటూ మీడియా తో షర్మిల జగన్ పై ఆస్తి కేసుల విషయంలో వెనుకుండి నడిపించేది చంద్రబాబు అంటూ షర్మిలను ఏమి చెయ్యలేక వైసీపీ నేతలంతా చంద్రబాబు పై ఏడుస్తున్నారు.