Advertisement
Google Ads BL

BB 8: ఈ వారం డేంజర్ జోన్ లో..


బిగ్ బాస్ సీజన్ 8 ఎనిమిదో వారం పూర్తవ్వబోతుంది. ఇంకా రెండు రోజుల్లో ఈ వారం పూర్తవుతుంది. ప్రస్తుత సీజన్ పై విమర్శలెలా ఉన్నా సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ ఎలిమిషన్ పై జరుగుతున్న ఓటింగ్ ఒకలా ఉంటె.. యాజమాన్యం ఎవరిని ఎలిమినేట్ చేస్తుందో అనేది లాస్ట్ మినిట్ వరకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. 

Advertisement
CJ Advs

గత వారం అదే జరిగింది. హరితేజ లేదా టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతారనుకుంటే అనూహ్యంగా గౌతమ్ ను డేంజర్ జోన్ లో పెట్టారు. లక్కీగా నాగమణికంఠ తప్పుకున్నాడు కాబట్టి గౌతమ్ సేఫ్ అయ్యాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో నిఖిల్, ప్రేరణ, హరితేజ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని ఉండగా గౌతమ్ తన పవర్స్ తో హరితేజ ను సేవ్ చేసాడు. 

ఇక ఓటింగ్ లో సీరియల్ ఆర్టిస్ట్ ప్రేరణ నిఖిల్ కి షాకిచ్చి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు, ఆ తర్వాత పృథ్వీ, విష్ణు ప్రియాలు ఉంటే.. చివరిగా మెహబూబ్, నయని పావని లు డేంజర్ జోన్ లో ఉన్నారు. మెహబూబ్ గేమ్ లో ఎక్కడా హైలెట్ అవ్వడమే లేదు, అటు నయని ఆట కూడా అంతగా అనిపించడం లేదు, దానితో ఈ వారం ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం ఖాయంగా కనబడుతుంది. 

BB 8: This week in the danger zone..:

BB 8: Nayani Pavani and Mehaboob in danger zone
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs